రాజమౌళి నెక్ట్స్ చిత్రంలో హీరోయిన్ ఆమె కన్ఫర్మ్
రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో ప్రారంభం కానున్న చిత్రంలో సమంతాని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు సమాచారం. గౌతం మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏ మాయ చేసావే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె ఇప్పటికే ఎన్టీఆర్ సరసన బృందావనంలో రెండో హీరోయిన్ గా చేస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కాజల్ మొదటి హీరోయిన్ గా చేస్తోంది. ఇక సమంతా శ్రీను వైట్ల, మహేష్ బాబు చిత్రంలో నూ హీరోయిన్ గా కన్ఫర్మ్ అయినట్లు విశ్వనీయంగా తెలుస్తోంది. అలాగే తమిళంలోనూ రెండు చిత్రాల్లో చేయటానికి ఆమె సైన్ చేసింది. నాగచైతన్య సరసన చేసిన ఏమి మాయ చేసావే చిత్రంలో జెస్సీగా అదరకొట్టిన సమంతా రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ అయింది. ఈ మధ్య కాలంలో ఇలియానా తర్వాత అంత స్పీడుగా ఆఫర్స్ అందిపుచ్చుకుంది ఈమే కావటం గమనార్హం.
సమంత రాజమౌళి ప్రభాస్ జూ ఎన్టీఆర్ ఏ మాయ చేసావే జెస్సీ త్రిష గౌతం మీనన్ నాగచైతన్య rajamouli prabhas samantha srinu vytla jr ntr ye maya chesave jessy trisha goutham menan nagachaitanya


Click it and Unblock the Notifications