బాలయ్య, సమంత ఆ... తాంత్రికున్ని సంప్రదించారా?
హైదరాబాద్: ఏదైనా పని సఫలం కావడం కోసం, చాలా రోజులుగా పీడిస్తున్న అనారోగ్యం మటుమాయం అవ్వడం కోసం చాలా మంది పూజలు గట్రా చేయిస్తుంటారు. సినీ ప్రముఖులు కూడా ఇందుకు మినహాయింపు కాదు. వారు కూడా సాధరణ మానవులు కాబట్టి వారికి అలాంటి నమ్మకాలు గట్రా ఉంటాయి.
తాజాగా ఈ విషయానికి సంబంధించి నందమూరి నటసింహం బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ స్టార్ హీరోయిన్ సమంత పేర్లు వినిపిస్తున్నాయి. సమంత ఆ మధ్య అనారోగ్యం కారణంగా షూటింగులకు దూరమైన సంగతి తెలిసిందే. ప్రఖ్యాత డాక్టర్లను సంప్రదించినా ఆమె అనారోగ్యం నయం కాలేదు. చివరి ప్రయత్నంగా సమంత కేరళకు చెందిన ప్రముఖ తాంత్రి టి.ఎస్. వినీత్ భట్‌ను సంప్రదించిందట. గ్రహా, నక్షత్రాలు, రాసులకు సంబంధించి స్థితిగతులు పరిశీలించి పూజలు చేస్తుంటాడు ఈ తాంత్రి.
నందమూరి నటసింహం బాలయ్య కూడా తన భవిష్యత్ ఇటు సినిమాల్లో, రాజకీయాల్లో అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ టి.ఎస్.వినీత్ భట్ ను సంప్రదించి ప్రత్యేక పూజలు చేయించినట్లు తెలుస్తోంది. తన వద్దకు వచ్చే వారి స్థితిని బట్టి, చేసే పూజా విధానాన్ని బట్టి రూ. 10వేల నుంచి రూ. కోటి వరకు వసూలు చేస్తుంటాడట టి.ఎస్.వినీత్ భట్. ఆయన దగ్గరికి వచ్చే వారిలో సినీ స్టార్లు, పెద్ద పెద్ద బిజినెస్ మేన్లే ఎక్కువని అంటుంటారు.
అనారోగ్యం కారణం కొంత కాలంగా షూటింగులకు దూరమైన సమంత ఇప్పుడు ఆరోగ్యం కుదుట పడటంతో మళ్లీ షూటింగులకు హాజరవుతోంది. సమంత ప్రస్తుతం బోలెడు సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. గౌతం మీనన్ దర్శకత్వంలో నాని సరసన ఎటోవెళ్లి పోయింది మనసు, దేవా కట్ట దర్శకత్వంలో నాగచైతన్య సరసన ఆటో నగర్ సూర్య, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు సరసన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నందినిరెడ్డి దర్శకత్వంలో సిద్ధార్థ సరసన ఓ సినిమా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రామ్ చరణ్ సరసన ఎవడు చిత్రాల్లో నటిస్తోంది.


Click it and Unblock the Notifications