హాట్ టాపిక్: సమంత బోయ్ ప్రెండ్ తో సమస్య
ఏ మాయ చేసావే చిత్రంతో పరిచయమై దూకుడుతో స్టార్ అయిన సమంతకో బోయ్ ప్రెండ్ కే ప్రయారిటీ ఇస్తోందంటూ వార్తలు వినపడుతున్నాయి. ఇంతకీ ఎవరా బోయ్ ప్రెండ్ అంటే దర్శకుడు వంశీ పైడిపల్లి అని చెప్తున్నారు. బృందావనం చిత్రం షూటింగ్ సమయంలో వీరిద్దరూ దగ్గరయ్యారని అందుకే డేట్స్ ఎడ్జెస్ట్ కాకపోయినా ఈ దర్శకుడుకి ఎవడు చిత్రానికి డేట్స్ కేటాయించింది అని చెప్తున్నారు. ఇక ఇప్పటికే సమంత మీద బెల్లకొండ సురేష్ ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్ చేసారు. ఎందుకంటే ఆమె తాను నందినీ రెడ్డి దర్శకత్వంలో సిద్దార్ద హీరోగా చేస్తున్న చిత్రానికి డేట్స్ కేటాయించలేకపోయిందని మొదట కమిటైన కమిట్మెంట్ కు కట్టుబడి ఉండటం లేదని అన్నారు.
ఇక మరో ప్రక్క ఆమె దిల్ రాజు నిర్మిస్తున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రానికి సైతం డేట్స్ ఇవ్వలేకపోవటంతో ఆ చిత్రం షూటింగ్ వాయిదా పడింది. ఇటువంటి పరిస్ధితుల్లో కూడా ఆమె ఎవడు చిత్రం చేస్తోంది. అయితే ఎవడు చిత్రం ఒప్పుకోవటానకి కారణం కేవలం రామ్ చరణ్ చిత్రమనే కానీ,మరో కారణం లేదని ఆమె స్నేహితులు అంటున్నారు. ఏదైమైనా ఈ డేట్స్ ఇష్యూతో మరోసారి వంశీ పైడిపల్లి తెరపైకి వచ్చారు.


Click it and Unblock the Notifications











