వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున సమంత ప్రచారం?

హైదరాబాద్: ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ రాజకీయ పార్టీలన్నీ సినిమా తారల వైపు తమ దృష్టి సారించాయి. వారితో ప్రచారం చేయిస్తే ఎంతో కొంత గెలుపు శాతం పెరిగే అవకాశం ఉండటంతో వీలైనంత మందిని రంగంలోకి దింపేందుకు తమ శక్తిమేర ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటికే పలువురు సినీ తారలు వివిధ పార్టీల్లో చేరి ఆయా పార్టీల తరుపున ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈ లిస్టులో ఇపుడు సమంత పేరు కూడా వినిపిస్తోంది. తమ పార్టీ తరుపున ప్రచారం చేసేందుకుగాను ఆ పార్టీ ఆమెకు భారీ మొత్తం ఆఫర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Samantha Campaigning For Jagan Mohan Reddy's YSR Congress?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వారిలో కోన రఘుపతి ఒకరు. కోన రఘుపతి కూతురు కోన నీరజ సమంత పర్సనల్ డ్రెస్ డిజైనర్‌గా పని చేస్తోంది. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలో కోన నీరజ సమంతను ప్రచారం చేయించడానికి ఒప్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారానికి గాను ఆమె రూ. కోటి రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరి సమంత కేవలం ఒక కోన రఘుపతి తరుపున మాత్రమే ప్రచారం చేస్తుందా? లేక ఆ పార్టీ అభ్యర్థులందరి తరుపున వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రచారం చేస్తుందా? అనేది తేలాల్సి ఉంది. అయితే ఒక అభ్యర్థికి కోటి రెమ్యూనరేషన్ ఇచ్చే అవకాశం లేదని, పార్టీ మొత్తానికి ప్రచారం చేయడానికి ఆమెకు ఈ భారీ మొత్తం ఆఫర్ చేసి ఉంటారనే చర్చ సాగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X