500 కోట్ల ప్రాజెక్టులోకి సమంత.. ప్రియాంక చోప్రా అవుట్
తెలుగు సినిమాకి చెందిన కొందరు టాప్ మోస్ట్ స్టార్ హీరోయిన్స్ లో బ్యూటీ సమంత కూడా ఒకరు. కాగా సమంత తెలుగులో సెకండ్ లీడ్ హీరోయిన్ గా చేసే స్టేజి నుంచి ఇపుడు తాను సెకండ్ లీడ్ గా చేసిన సినిమాలో మెయిన్ హీరోయిన్స్ ని మించిన స్టార్డం అండ్ మార్కెట్ ని పాన్ ఇండియా లెవెల్లో సొంతం చేసుకోవడం తన ఎదుగుదలకి నిదర్శనం అని చెప్పవచ్చు.
కాగా సమంత ఇలా తన రేంజ్ ని పెంచుకుంటూ వెళ్ళింది కానీ ఇపుడు ఏదైతే తెలుగు సినిమాలో ఆమె ఒక వెలుగు వెలిగిందో ఇపుడు అదే తెలుగు సినిమాకి దూరంగా ఉందని ఆమెకి తెలిసిందే. కాగా పర్సనల్ లైఫ్ లో కొన్ని ఇబ్బందులు మూలాన సమంత కొన్నాళ్ళు పాటుగా మొత్తం సినిమాలకే దూరం అయ్యింది. పైగా హిందీ సినిమాకి దగ్గర కావడంతో ఆమె నెమ్మదిగా తెలుగు వైపు చూడడం కూడా మానేసింది.

కానీ ఆ మధ్య సౌత్ లో తమిళ్ సినిమాలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టుగా టాక్ వచ్చింది కానీ అది కూడా నిజం లేదు. కాగా ఇపుడు కొన్ని ఊహించని రూమర్స్ సమంత విషయంలో వినిపిస్తున్నాయి. దీనితో తెలుగులో సమంత తన కంబ్యాక్ ని ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అది కూడా ఏకంగా 500 కోట్ల బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ తో తెలుగు ఆడియెన్స్ ని అలరించేందుకు రాబోతుందట.
ఈ మధ్య కాలంలో తెలుగు హీరోస్ నుంచి ఆ రేంజ్ ప్రాజెక్ట్ ఏంటా అనుకుంటున్నారా? ఉంది.. మొన్నీమధ్యే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు అట్లీ కలయికలో అనౌన్స్ చేసిన సినిమా ఉందిగా ఆ సినిమాలోనే సమంత హీరోయిన్ గా కనిపించే ఛాన్స్ ఉందట. కాగా ఈ సినిమా కోసం మొదట ఇండో, హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాని అనుకున్నారట కానీ ఆమె ఈ సినిమాని రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది.
తన రోల్ కి వెయిట్ సరిపోలేదని భావిస్తోందట. అందుకే ప్రియాంక చోప్రా రిజెక్ట్ చేసిన పాత్రని ఇపుడు అట్లీ సామ్ కోసం లాక్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాని ఆల్రెడీ హాలీవుడ్ లెవెల్లోనే అనౌన్స్ చేశారు. పైగా హీరోతో పాటుగా హీరోయిన్ కూడా స్టంట్స్ తప్పనిసరి. అందుకే మొదట ప్రియాంక సరిపోతుందని అనుకున్నారు కానీ ఇపుడు ఆమెని సమంత రీప్లేస్ చేస్తుందని తెలుస్తుంది.
కాగా సమంత ది ఫ్యామిలీ మ్యాన్ 2 అలాగే రీసెంట్ గానే సిటాడెల్ హనీ బన్నీ సిరీస్ లలో ఊహించని యాక్షన్ చూపించింది. సో అలా సమంత బెస్ట్ ఛాయిస్ గా అట్లీ అనుకుంటున్నాడట. దీనితో ఈమె ఫైనల్ అయినట్టుగా వినికిడి. కాగా ఇది వరకే అల్లు అర్జున్ తో సన్నాఫ్ సత్యమూర్తి అలాగే అట్లీతో తేరి అనే సినిమాలు సమంత చేసిన సంగతి తెలిసిందే. కాకపోతే ఈ టాక్ నిజం ఐతే మాత్రం ముగ్గురు ఈ సినిమా కోసం మొదటిసారి వర్క్ చేస్తారు.


Click it and Unblock the Notifications











