చైతూ అమ్మకు సమంత కంప్లైంట్స్.. దేని గురించో తెలుసా..
అక్కినేని సినీ వారసుడు నాగచైతన్యకు అన్ని శుభసూచకాలే కనిపిస్తున్నాయి. తాను నటించిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా భారీగా కలెక్షన్లను రాబడుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నది.
అక్కినేని సినీ వారసుడు నాగచైతన్యకు అన్ని శుభసూచకాలే కనిపిస్తున్నాయి. తాను నటించిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా భారీగా కలెక్షన్లను రాబడుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నది. మరోవైపు తాను ప్రేమించిన సమంతను వివాహం చేసుకొనే శుభగడియలు సమీపిస్తున్నాయి. వీరి వివాహం అక్టోబర్‌లో జరుగనున్నది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను త్వరలో ప్రారంభించనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇటీవల మీడియాతో నాగచైతన్య మాట్లాడుతూ.. సమంత గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

ఫోన్ చేసి కంప్లైంట్స్
సమంత నాతో కంటే అమ్మతోనేఎక్కువ చనువుగా ఉంటుంది. నాతో గొడవపడితే ముందు మా అమ్మకే ఫోన్ చేసి కంప్లైంట్స్‌ఇస్తుంది. వాళ్లిద్దరూ రోజూ కనీసం గంటపాటు ఫోనులో మాట్లాడుకుంటారు. అమ్మ చెన్నై వచ్చినప్పుడల్లా సమంత కలవడానికి వెళుతుంది. నాన్న, సమంత కలిస్తే మాత్రం ఎప్పుడూ సినిమాల గురించే మాట్లాడుకుంటారు అని చైతూ చెప్పుకొచ్చారు.

మామ కోడళ్ల అనురాగం
రారండోయ్ వేడుక చూద్దాం చిత్రం గురించి నాగార్జున, సమంతలిద్దరూ వాట్సప్‌లో చాటింగ్ చేసుకొన్న వ్యవహారం అక్కినేని అభిమానులను సంతోషానికి గురిచేసింది. మామ కోడళ్ల మధ్య వాట్సప్ అనురాగం ముచ్చటగా మారింది. చైతూ, సమంత పెళ్లిని నాగార్జున మనసారా ఆస్వాదిస్తున్నారనడానికి నిదర్శనంగా నిలిచింది.

సినిమాలను తగ్గించుకొంటున్న సామ్
చైతూతో పెళ్లికి సమంత కూడా రెడీ అవుతున్నది. వివాహానికి కొన్ని నెలల ముందే సినిమాలను బాగా తగ్గించుకొంటున్నది. షూటింగ్‌లో ఉన్న చిత్రాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. జనతాగ్యారేజ్ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని రాజుగారి గది2లో నటిస్తున్నది. అలాగే మెగా హీరో చరణ్‌తో మరో సినిమాను చేస్తున్నది. మహానటి సావిత్రి బయోపిక్‌లో సమంత నటించడానికి అంగీకారం తెలిపినట్టు సమాచారం. పెళ్లి తర్వాత సమంత హీరోయిన్‌గా చేస్తుందా, చేయదా? అనే ప్రశ్నలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

35 కోట్లు వసూలు చేసిన రారండోయ్
సమంతతో ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత విడుదలైన రారండోయ్ వేడుక చూద్దాం చిత్రం చైతూకు మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఈ సినిమా విడుదలైన తొమ్మిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.35 కోట్లు రాబట్టింది. అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఈ చిత్రానికి అక్కినేని నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. సొగ్గాడే చిన్నినాయన ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications











