Samantha Ruth Prabhu ఇంటిని వదిలేసి.. అక్కడే మకాం వేసిన సమంత
విడాకుల తర్వాత సమంత కుంగిపోతుంది అని అందరూ అనుకున్నారు కానీ విడాకులు ప్రకటన చేసిన తర్వాత వరుస సినిమాలు చేస్తూ హాట్ టాపిక్ గా మారింది. ఆమె పుష్ప కోసం చేసిన 'ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా..' సాంగ్‌తో ఒక్క దెబ్బకు క్రేజ్ దేశమంతా పాకింది. 'పుష్ప' సినిమాలో ఆ పాటకే కాదు సమంత అందచందాలకు కూడా అందరూ ఫిదా అయ్యారు అనడంలో అతిశయోక్తి కాదు. తాజాగా యశోద సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

సెట్స్ వేసి
ప్రస్తుతం సమంత ఆమె పాన్ ఇండియా మూవీ 'యశోద'లో నటిస్తోంది. హరి, హరీష్ అనే దర్శక ద్వయం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో 30 - 40 శాతం సన్నివేశాలు ఒకే ప్రాంతంలో జరుగుతాయని అంటున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో కోట్ల రూపాయల ఖర్చుతో సెవెన్ స్టార్ హోటల్స్ సౌకర్యాలను తలపించేలా సెట్స్ వేసిన విషయం తెలిసిందే.

సస్పెన్స్ థ్రిల్లర్
నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత నటిస్తున్న తొలి చిత్రం యశోద. పుష్పలోని ఆమె మొదటి ఐటెం సాంగ్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌తో ఆమె కెరీర్ హైలో ఉంది. దర్శక ద్వయం హరి మరియు హరీష్ దర్శకత్వం వహించిన యశోద ఓక న్యూ ఏజ్ కథాంశంతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్. శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Recommended Video


సెట్ లోనే మకాం
అయితే సమంత ఇల్లు వదిలేసి సెట్స్‌లోనే ఉండిపోయిందని కూడా వార్తలు వచ్చాయి. సెట్ బాగా నచ్చడంతోపాటు త్వరగా షూటింగ్‌కు రెడీ అవొచ్చన్న ఉద్దేశ్యంతో సామ్ కొన్నిరోజుల పాటు హోటల్ సెట్ లోనే మకాం వేసినట్టు కూడా ప్రచారం జరిగింది. ఇక ఈ సినిమాలో ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











