కోటిన్నర తీసుకుంటున్న సమంత?
హాట్ హీరోయిన్ సమంత అందాలకు, నటనకు సినిమా మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండటంతో అమ్మడు పారితోషికం ఒక్కసారిగా పెంచేసింది. నిన్న మొన్నటి వరకు రూ. 80 లక్షల వరకు తీసుకున్న సమంత ఇప్పుడు ఏకంగా కోటిన్నర రూపాయలు డిమాండ్ చేస్తోందట.
తను నటించిన సినిమాలన్నీ వరుసగా విజయం సాధించడం, వరుస సినిమాలతో బిజీగా ఉన్న తన కోసం....ఇంకా చాలా మంది నిర్మాతలు క్యూలో ఉండటంతో అదును చూసి ఒక్కసారిగా రేటు పెంచింది. సమంతకు తొలిసారిగా అంత పెద్ద మొత్తాన్ని ఇవ్వడానికి ఓ నిర్మాత ముందుకు వచ్చాడని తెలుస్తోంది.
తెలుగులో వరుసగా భారీ చిత్రాల్ని నిర్మించే ఆ అగ్రనిర్మాత తన తనయుడిని హీరోగా పరిచయం చేస్తూ ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. క్రేజీ మాస్ డైరెక్టర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. తనయుడి తెరంగ్రేటాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న సదరు నిర్మాత ఆ చిత్రంలో హీరోయిన్‌గా సమంతను ఖరారు చేసుకున్నట్లు తెలిసింది. ఈ సినిమా కోసం సమంతా కోటిన్నర పారితోషికం తీసుకోబోతోందని అంటున్నారు.
ప్రస్తుతం సమంత రాజమౌళి 'ఈగ', నాగచైతన్యతో కలిసి 'ఆటో నగర్ సూర్య', నాని హీరోగా గౌతం మీనన్ దర్శకత్వంలో 'ఎటో వెళ్లి పోయింది మనసు', మహేష్ బాబు సరసన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', నందినిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో సిద్ధార్థ సరసన, రామ్ చరణ్ సరసన 'ఎవడు' చిత్రంలో, మణిరత్నం సినిమా 'కడల్'లో నటిస్తోంది.


Click it and Unblock the Notifications