Samantha drops Akkineni: పేరు మార్పుపై రూమర్లు.. 'S' వెనుక కారణం అదే అంటూ..
దక్షిణాదిలో టాప్ హీరోయిన్ సమంత అక్కినేని మరోసారి సెన్సేషనల్ వార్తలకు, వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. లాక్‌డౌన్‌లో ఎలాంటి హంగామా లేకుండా నిరాడంబరంగా కెరీర్ ప్లాన్ చేసుకొంటున్నట్టు కనిపించిన సమంత తాజాగా సోషల్ మీడియాలో తన అఫీషియల్ అకౌంట్లలో పేరు మార్పు చేయడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో ఆమె గురించి వస్తున్న రూమర్లు, గాసిప్స్ విషయాల్లోకి వెళితే...

ఫ్యామిలీ మ్యాన్‌తో మరో రేంజ్
లాక్‌డౌన్‌లో పెద్దగా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టకుండా ప్రశాంత జీవితం గడిపిన సమంత అక్కినేని.. కెరీర్ పరంగా మరో రేంజ్‌కు వెళ్లింది. తొలిసారి వెబ్ సిరీస్‌లో నటించి దేశవ్యాప్తంగా ప్రేక్షకులను సంపాదించుకొన్నది. ఆమె నటించిన ఫ్యామిలీ మ్యాన్ మూవీకి దక్షిణాదితోపాటు ఉత్తరాదిలో కూడా మంచి రెస్పాన్స్ రావడంతో ఆమె నటన స్థాయి మరింత పెరిగినట్లయింది.

గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం
ఇక సెకండ్ వేవ్ లాక్‌డౌన్ తర్వాత సమంత అక్కినేని టాలీవుడ్‌లో భారీ స్థాయిలో సినిమాను మొదలుపెట్టింది. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమాలో నటించేందుకు సిద్ధమైంది. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా కొన్ని రోజులు తొలి షెడ్యూల్‌కు సంబంధించిన షూటింగ్ జరిగింది. కరోనావైరస్ కారణంగా కొద్ది రోజులుగా షూటింగ్ నిలిచిపోయింది.

అనూహ్యంగా పేరు నుంచి అక్కినేని తొలగింపు
ఇలా కెరీర్ గ్రాఫ్‌ను పెంచుకొంటూ వెళ్తున్న సమంత అక్కినేని ఎవరూ ఊహించని విధంగా తన పేరులో నుంచి అక్కినేనిని తొలగించడం అనేక ఊహాగానాలకు తెరలేపింది. అయితే తన పేరులో నుంచి అక్కినేని పేరును ఎందుకు తొలగించాల్సి వచ్చిందనే విషయంపై క్లారిటీ లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే నర్మగర్భంగా సమంత వ్యవహరించడంతో అనేక రూమర్లు క్రియేట్ అవుతున్నాయి.

అక్కినేని తొలగింపుపై రూమర్లు
అయితే అక్కినేని కుటుంబంలో సమంత ఉండలేకపోతున్నది. తన కాపురంలో ఏవో కలతలు చోటుచేసుకొన్నాయనే విషయాలు మీడియాలో హైలెట్ అవుతున్నాయి. ఆ క్రమంలోనే తన పేరు నుంచి అక్కినేని పదాన్ని తొలగించింది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్నాయి. అయితే ఆమె సన్నిహితులు ఈ రూమర్లు తేలికగా తీసుకొంటూ కొట్టిపడేస్తున్నారు.
Recommended Video

S లెటర్ వెనుక అసలు కారణం
అయితే Akkineni పదం తొలగించి ఆ ప్లేస్‌లో S అనే అక్షరం పెట్డడం వెనుక అసలు విషయాన్ని కొందరు ఆమె సన్నిహితులు వెల్లడించారు. ఆమె నటిస్తున్న శాకుంతలం సినిమా టైటిల్ మొదటి అక్షరాన్ని సోషల్ మీడియాలో పెట్టింది. ఆమె సినిమా తన మనసుకు బాగా నచ్చడంతో అలా S అక్షరాన్ని పెట్టుకొన్నారు అంటూ కొందరు క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే సమంత అసలు విషయం బయటపెడితే గానీ S అక్షరం వెనుక మర్మం బయటపడదంటున్నారు సినీ వర్గాలు.


Click it and Unblock the Notifications











