బాంబ్ బ్లాస్ట్ నుండి తృటిలో తప్పించుకొన్నసమంత
'ఏ మాయ చేసావె' చిత్రం తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు సరసన సమంత 'దూకుడు" సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం ఈ యూనిట్ టర్కీ వెళ్ళింది. షూటింగ్ కి ఓ రోజు గ్యాప్ రావడంతో సమంత ఇస్తాంబుల్ లోని టక్ స్కీమ్ లో షాపింగ్ చేయడానికి వెళ్ళింది. తనతో పాటు ామె మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ స్టైలిస్ట్ కూడా ఉన్నారు. కరెక్ట్ గా ఆ షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర్లో బాంబు బ్లాస్ట్ అయ్యి 32మంది గాయాల పాలయ్యారు. ఇదంతా సమంత నిల్చుని ఉన్న ఎదురు రోడ్డులో జరగడంతో తటిలో తనకు తప్పిన ప్రమాదాన్ని తలుచుకుని సమంత షాక్ అయ్యింది. కొంత సేపు ఈ ప్రమాదానికి సంబంధించిన జ్ఝాపకాలు సమంతను వెంటాడినా తర్వాత మెల్లి మెల్లిగా ఈ ఇన్సిడెంట్ ను మర్చిపోయి మరుసటి రోజు షూటింగ్ లో పాల్గొందట సమంత.
సమంత దూకుడు మహేష్ బాబు శ్రీను వైట్ల ఖలేజా బృందావనం samantha dookudu mahesh babu srinu vytla khaleja brindavanam


Click it and Unblock the Notifications