ఆసిన్ ని తీసేసి సమంతను బుక్ చేసారు
ఇప్పుడు సమంత హవా నడుస్తోంది. ఎంతలా అంటే అసిన్ చేసిన ఫరెవర్ యాడ్ ఫిలిం వాళ్లు ఆమెను కాదనుకుని సమంతతో కంటిన్యూ అవుదామనుకుంటున్నారు. అసిన్ ని పెట్టిన తర్వాత వాళ్లు అనుకున్న టార్గెట్ రీచ్ కాలేదని ఫీల్ అవ్వటంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అలాగే సమంతను పెట్టుకుంటే తమిళ,మళయాళ,తెలుగు మార్కెట్ ను కూడా ఒకే సారి టార్గెట్ చేసినట్లు అవుతుందని,ఇప్పుడు ఇక్కడ ఆమే టాప్ అని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఇక ప్రస్తుతం సమంత వరస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె చేతిలో ప్రస్తుతం ఏడు సినిమాలు ఉన్నాయి. రాజమౌళితో చేస్తున్న ఈగ,గౌతమ్ మీనన్ తో చేస్తున్న చిత్రం ఈ రెండు మొదటగా విడుదల కానున్నాయి. ఈ రెండు చిత్రాల్లోనూ నానినే హీరో కావటం విశేషం. మరో ప్రక్క మణిరత్నం చిత్రంలో బుక్కవటం కూడా ఆమెకు బాగా కలిసి వచ్చే అంశం.


Click it and Unblock the Notifications











