»   » షాకింగ్: సమంత 1 రోజు తిండి ఖర్చు అంతా?

షాకింగ్: సమంత 1 రోజు తిండి ఖర్చు అంతా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: డిమాండ్ ఉన్న స్టార్స్‌తో సినిమా తీయాలంటే వారి రెమ్యూనరేషన్‌తో పాటు వారి పర్సనల్ ఖర్చులు భరించాలంటే నిర్మాతలకు ఇపుడు తలకు మించిన భారం అవుతోంది. ఇతర ప్రాంతాల్లో వారితో సినిమా ప్లాన్ చేసినపుడు వారికి కోసం ఫైవ్ స్టార్ హోటల్ సౌకర్యాలు కల్పించి, ఖరీదైన తిండి ఏర్పాట్లు నిర్మాతలే భరించాల్సి వస్తుంది. సినిమా షూటింగ్ పూర్తయ్యే సమయానికి వారి రెమ్యూనరేషన్‌తో సమానంగా ఇతర ఖర్చలు అవుతున్నాయట. దీంతో నిర్మాతలు తలబాదుకోవాల్సిన పరిస్థితి వస్తోంది.

తాజాగా స్టార్ హీరోయిన్ సమంతకు సంబంధించి ఇలాంటి విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆమెతో సినిమా తీయాలంటే ఆమె తిండి ఖరీదు రోజుకు రూ. 35 వేల వరకు నిర్మాత భరించాల్సి వస్తుందట. ఆ మధ్య సమంతకు స్కిన్ ఎలర్జీ వచ్చినప్పటి నుండి అమ్మడు బయట ఫుడ్ అస్సలు తినడం లేదట. తన వెంటే ఒక స్పెషల్ కుక్‌ను తెచ్చుకుంటుంది.

Samantha Food Cost 35,000!

సినిమా యూనిట్ సభ్యులు తినే ఆహారం ఆమె అస్సలు ముట్టుకోదట. తన వెంట తెచ్చుకున్న కుక్ ఆమెకు కావాల్సిన స్పెషల్ వంటకాలు వండి పెడతాడు. ఆమె అందాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేకమైన ఐటమ్స్ చేయించుకుంటుందట. కుక్ సాలరీ, వంటకు వాడే ఖరీదైన ఐటెమ్స్ అంతా కలుపుకుంటే రోజుకు దాదాపు రూ. 35 వేల వరకు అవుతుందట. తమ సినిమాలకు సమంత కావాలి కాబట్టి ఇవన్నీ భరించక తప్పడం లేదు నిర్మాతలకు.

English summary
Samantha never prefer to have the food which cinema unit provide her. She have the food which her cook has prepared for her. Salary and the cooking items all cost Rs. 35000.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu