సమంత సెంటిమెంట్‌ను వాడుకుంటున్న అఖిల్.. మరిది కోసం వదిన ఒప్పుకోక తప్పలేదట.!

By Manoj

అక్కినేని నాగార్జున తనయుడు, ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన మూడో తరం హీరో అఖిల్‌కు కాలం కలిసి రావడం లేదు. ఏడాది వయసులోనే 'సిసింద్రీ' సినిమాతో మెప్పించిన అతడు.. హీరోగా మాత్రం ఒక్క హిట్‌నూ తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. హీరోగా చేసిన మూడు చిత్రాలు నిరాశ పరిచాయి. ఆకట్టుకునే అందం, ఫిజిక్, నటన ఉన్నా కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో అతడు చేసిన మూడు ప్రయత్నాలూ విఫలం అయ్యాయి. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. అందుకోసం ఎన్నో ప్లాన్స్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే తన వదిన సెంటిమెంట్‌ను వాడుకోబోతున్నాడట. ఇంతకీ ఏంటా సెంటిమెంట్.? పూర్తి వివరాల్లోకి వెళితే...

అల్లు అరవింద్‌కు బాధ్యతలు

అల్లు అరవింద్‌కు బాధ్యతలు

కెరీర్ ఆరంభం నుంచీ వరుస పరాజయాలతో సతమతం అవుతున్న తన కొడుకు బాధ్యతలను అల్లు అరవింద్‌కు అప్పగించాడట సీనియర్ అక్కినేని నాగార్జున. గతంలో ఈ వార్త ఇండస్ట్రీలో బాగా ప్రచారం అయింది. ‘మిస్టర్ మజ్నూ' ఫ్లాప్ అయిన తర్వాత అఖిల్ తదుపరి సినిమాను కూడా ఆయనకు అప్పగించినట్లు వార్తలు వచ్చాయి.

వాళ్లిద్దరూ కలిసి బ్రేక్ ఇవ్వాలని

వాళ్లిద్దరూ కలిసి బ్రేక్ ఇవ్వాలని

అఖిల్ నాలుగో సినిమా కొద్ది రోజుల క్రితం ప్రారంభం అయిన విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ 2 బ్యాన‌ర్‌పై బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను బన్నీ వాస్, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, ఈ సినిమాకు గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఎన్నో అవాంతరాల తర్వాత

ఎన్నో అవాంతరాల తర్వాత

వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, స్క్రిప్టులో మార్పులు కారణంగా భాస్కర్ కొద్ది రోజులు టైమ్ తీసుకున్నాడు. ఇక, ఆ తర్వాత నటీనటుల డేట్స్ అడ్జస్ట్ అవ్వలేదు. అన్నీ కుదిరిన తర్వాత హీరోయిన్ ఎంపిక కూడా ఈ సినిమా ఆలస్యం అవడానికి కారణం అయింది. ఈ మూవీ ఎన్నో అవాంతరాల నడుమ షూటింగ్ జరుపుకుంటోంది.

 అఖిల్ తండ్రిగా దర్శకుడు

అఖిల్ తండ్రిగా దర్శకుడు

ఈ సినిమాలో అత్యంత ముఖ్యమైన తండ్రి పాత్ర కోసం ఎంతో మందిని అనుకున్నారు. చివరిగా నాలో, శంభో శివ శంబో, జెండాపై కపిరాజు సినిమాలను డైరెక్ట్ చేసిన సముద్రఖనిని ఎంపిక చేసుకున్నారు. ఆయన ప్రస్తుతం ఈ సినిమాతో పాటు అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ‘అల.. వైకుంఠపురములో..' మూవీలో విలన్‌గా నటిస్తున్నారు.

సమంతను దించుతున్నాడు

సమంతను దించుతున్నాడు

తాజాగా ఈ మూవీ గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఇందులో ఓ ముఖ్యమైన అతిథి పాత్రకు అక్కినేని సమంతను తీసుకుంటున్నారనేదే ఆ వార్త సారాంశం. వరుస విజయాలు అందుకుంటున్న ఆమె.. తనకు హెల్ప్ అవుతుందని భావిస్తున్నాడట అఖిల్. అతడి కోసమే ఈ పాత్ర చేయడానికి సమంత ఒప్పుకుందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X