Don't Miss!
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కొత్తగా.. కొత్తగా.. అంటూ ఎదురుచూస్తున్న సమంత
సూపర్ స్టార్ ట్యాగ్‌ను తగిలించే సత్తా ఉన్న నటి సమంత. వరుస విజయాలతో దూసుకుపోవడమే కాకుండా.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో నిర్మాత జేబులను కూడా నింపేస్తుంది. ఈ కాలంలో సూపర్ స్టార్ అనడానికి ఇంతకన్నా ఏముంటుంది. ఎంతో మంది హీరోలే హిట్లు లేక, కాలంతో పరుగులు పెట్టలేక వెనకబడుతూ ఉంటే.. పెళ్లి చేసుకున్న హీరోయిన్ అంతకు ముందు కంటే రెట్టింపు ఉత్సాహంతో హిట్ల మీద హిట్లు కొడుతుంది.
సమంత హవా కేవలం టాలీవుడ్లోనే అనుకుంటే పొరపాటే. విశాల్ అభిమన్యు, సూపర్ డీలక్స్ చిత్రాలతో సూపర్ హిట్స్ కొట్టింది సమంత. సూపర్ డీలక్స్‌లో సమంత చేసిన పాత్రను చూసిన వారంతా నోరెళ్లబెట్టారు. అంతటి బోల్డ్ పాత్రను కూడా చాలెంజింగ్‌గా తీసుకుని అందర్నీ మెప్పించింది. కొత్త దనం ఉన్న పాత్రలనే చేస్తూ వస్తోన్న సమంత.. ప్రస్తుతం ఖాళీగానే ఉన్నట్లు తెలుస్తోంది.
తమిళ హిట్ మూవీ 96కు రీమేక్‌గా తెరకెక్కుతున్న చిత్రంలో సమంత నటిస్తోంది. రీసెంట్గా తన పాత్రకు సంబంధించిన పార్ట్‌ను పూర్తి చేసుకుంది. అటుపై తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈమేరకు కొత్తదనం ఉండే పాత్రలకు, కథ, కథనాలు కొత్త ఉండాలంటూ చెప్పుకొస్తుందని సమాచారం. ఇలా కొత్తగా కొత్తగా అంటూ సమంత ఎదురుచూస్తూనే ఉండటంతో కొత్త సినిమాలకు సైన్ చేయలేదని టాక్.