twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొత్తగా.. కొత్తగా.. అంటూ ఎదురుచూస్తున్న సమంత

    |

    సూపర్ స్టార్ ట్యాగ్‌ను తగిలించే సత్తా ఉన్న నటి సమంత. వరుస విజయాలతో దూసుకుపోవడమే కాకుండా.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో నిర్మాత జేబులను కూడా నింపేస్తుంది. ఈ కాలంలో సూపర్ స్టార్ అనడానికి ఇంతకన్నా ఏముంటుంది. ఎంతో మంది హీరోలే హిట్లు లేక, కాలంతో పరుగులు పెట్టలేక వెనకబడుతూ ఉంటే.. పెళ్లి చేసుకున్న హీరోయిన్ అంతకు ముందు కంటే రెట్టింపు ఉత్సాహంతో హిట్ల మీద హిట్లు కొడుతుంది.

    సమంత హవా కేవలం టాలీవుడ్‌లోనే అనుకుంటే పొరపాటే. విశాల్ అభిమన్యు, సూపర్ డీలక్స్ చిత్రాలతో సూపర్ హిట్స్ కొట్టింది సమంత. సూపర్ డీలక్స్‌లో సమంత చేసిన పాత్రను చూసిన వారంతా నోరెళ్లబెట్టారు. అంతటి బోల్డ్ పాత్రను కూడా చాలెంజింగ్‌గా తీసుకుని అందర్నీ మెప్పించింది. కొత్త దనం ఉన్న పాత్రలనే చేస్తూ వస్తోన్న సమంత.. ప్రస్తుతం ఖాళీగానే ఉన్నట్లు తెలుస్తోంది.

    Samantha Has No Projects She Wants New Subjects

    తమిళ హిట్ మూవీ 96కు రీమేక్‌గా తెరకెక్కుతున్న చిత్రంలో సమంత నటిస్తోంది. రీసెంట్‌గా తన పాత్రకు సంబంధించిన పార్ట్‌ను పూర్తి చేసుకుంది. అటుపై తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈమేరకు కొత్తదనం ఉండే పాత్రలకు, కథ, కథనాలు కొత్త ఉండాలంటూ చెప్పుకొస్తుందని సమాచారం. ఇలా కొత్తగా కొత్తగా అంటూ సమంత ఎదురుచూస్తూనే ఉండటంతో కొత్త సినిమాలకు సైన్ చేయలేదని టాక్.

    English summary
    Samantha Has No Projects In Her Hand. She Wants New Subjects. She Recently Competed 96 Remake Shooting. Sharwanandh As Lead Actor. Movie Is Producing By Dil Raju.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X