ఒక్కసారిగా పెంచేసి షాక్ ఇస్తున్న సమంత
ఏ మాయ చేసావె చిత్రంతో స్టార్ గా ఎదిగిన సమంత దాదాపు పెద్ద హీరోలందరి సరసన వరసగా బుక్కవతోంది. దాంతో ఇన్ని ఆఫర్స్ వచ్చేటప్పుడు తన రెమ్యునేషన్ కూడా పెంచాలని నిర్ణయానికి వచ్చేసింది.తనను సంప్రదించే సంస్ధను బట్టి అరవై లక్షల నుంచి డబ్బై లక్షల దాకా డిమాండ్ చేస్తోంది. అయితే నిర్మాతలు ఇదేమీ పట్టించుకునేటట్లు కనపడటం లేదు. హీరోల డేట్స్ కావాలంటే వారు చెప్పినట్లు సమంతను బుక్ చేయాల్సిందే అని భావిస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలనే ఆలోచన ఆమెకు అప్పుడే వచ్చినందుకు ఇండస్ట్రీ పెద్దలు భాదపడ్డా...ఆమె క్రేజ్ ఉన్నప్పుడే బుక్ చేసి తమ ప్రాజెక్టుకూ ఆ క్రేజ్ ను తెచ్చుకుందామనుకుంటున్నారు. ఇక సమంత తాజాగా ప్రబాస్ కోరికపై దిల్ రాజు చిత్రంలో సెలెక్ట్ అయింది. అలాగే సిద్దార్ధ హీరోగా చేసే తమిళ, తెలుగు చిత్రంలోనూ ఆమెను తీసుకున్నారు.
సమంత సిద్దార్ధ ప్రభాస్ జూ ఎన్టీఆర్ రవితేజ దశరధ్ వంశీ పైడిపల్లి బృందావనం samantha siddharth srinu vytla mahesh babu dasarath


Click it and Unblock the Notifications