కొత్త ఇంటి వేటలో సమంత.. అలాంటి ఇల్లే కావాలట.. ఓకే అనుకుంటే ఛలో ముంబై!

ఇప్పుడు బాలీవుడ్ భామలు కూడా టాలీవుడ్ వెంటపడుతుంటే టాలీవుడ్ సహా దక్షిణాది లో స్టార్ హీరోయిన్ అనిపించుకున్న సమంత మాత్రం బాలీవుడ్ పై దృష్టి పెడుతోంది. ఇప్పటికే హిందీలో కొన్ని వెబ్ సిరీస్ లు చేస్తున్న ఆమె హిందీ సినీ పరిశ్రమలో వరుస అవకాశాలు దక్కించుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

ముంబై వెళ్లి

ముంబై వెళ్లి


విడాకులు ప్రకటన తర్వాత సమంత వరుస సినిమాలు ఒప్పుకుంటూ ఎలాంటి గ్యాప్ లేకుండా చూసుకుంటోంది. అయితే హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతూ ఉండగా ఎప్పుడు కాస్త గాప్ దొరికినా ఆమె ముంబై వెళ్లి పోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి నయనతార బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, నయనతార, సమంత ప్రధాన పాత్రలో ఓ సినిమా రూపొందుతోంది.

ఇళ్ళు చూపించారు కానీ

ఇళ్ళు చూపించారు కానీ


తాజాగా ఈ సినిమా పాకప్ పార్టీ జరగగా ఆ పార్టీ అయిన వెంటనే చెన్నై నుంచి ఆమె ముంబై వెళ్ళిపోయింది. అయితే ఆమె హైదరాబాద్ కంటే ఎక్కువగా ముంబైలో ఉండడానికి గల కారణాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.. ముంబైలో బీచ్ వ్యూ ఉన్న ఒక ప్రాపర్టీ కొనడానికి సమంత సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ప్రాపర్టీ డీలర్ లు ఆమెకు చాలా ఇళ్ళు చూపించారు కానీ ఆమెకు నచ్చిన వ్యూ ఉన్న ఇంటిని మాత్రం చూపించలేకపోయారు అని తెలుస్తోంది.

ముంబైకి మారాలా లేక

ముంబైకి మారాలా లేక


గురువారం నాడు ఆమె మరి కొన్ని ఇళ్లను పరిశీలిస్తుందని అవి నచ్చితే వాటిలో ఒకదానిని కొనే అవకాశం ఉందని అంటున్నారు. మరో ప్రచారం మేరకు ప్రస్తుతానికి ఆమెకు ఇల్లు కొనే ఉద్దేశం లేదని ప్రస్తుతానికి ఒక మంచి ప్రాపర్టీ తీసుకుంటే ఆ తర్వాత బాలీవుడ్లో తనకు లభించే అవకాశాలను బట్టి పూర్తిగా ముంబైకి మారాలా లేక హైదరాబాదులోనే ఉండాలా అనే విషయం మీద ఆమె నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.

ఇల్లు కొనే అవకాశాలు ఎక్కువ

ఇల్లు కొనే అవకాశాలు ఎక్కువ


నిజానికి సమంత నాగచైతన్య విడాకులు ప్రకటన చేయకముందు ఇలాంటి ప్రచారం జరిగింది. సమంత ముంబై వెళ్లి పోతుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో అది నిజం కాదని తాను హైదరాబాద్లోనే ఉంటానని ఆమె అప్పట్లో చెప్పుకొచ్చింది. ఆ తర్వాత పరిణామాలలో నాగ చైతన్యతో విడాకులు తీసుకోవడం, వరుస సినిమా అవకాశాలు దక్కించుకోవడంతో పాటు ఇప్పుడు బాలీవుడ్ మీద ఎక్కువగా దృష్టి పెడుతున్న కారణంగా ఆమె ముంబైలో ఇల్లు కొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఇమేజ్ బాగా పెరిగి

ఇమేజ్ బాగా పెరిగి


ప్రస్తుతం ఆమె చేతిలో తమిళ తెలుగు సినిమా అవకాశాలు బాగానే ఉన్నాయి కానీ ఫ్యామిలీ మాన్ సిరీస్ చేసిన తర్వాత ఆమె ఇమేజ్ బాగా పెరిగింది. దానికి తోడు పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ కూడా ఆమెకు మంచి గుర్తింపు తీసుకుని వచ్చింది. ఆ గుర్తింపుని ఇప్పుడే వాడుకుంటే సరిపోతుంది కానీ మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ గా మొదలు పెట్టాలంటే కష్టమని భావిస్తున్న ఆమె పలు బాలీవుడ్ ప్రాజెక్టులలో భాగమయ్యేందుకు కూడా పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది ఎంత వరకు నిజం అనేది కాలమే నిర్ణయించాలి. చూడాలి సమంత రాబోయే రోజుల్లో ఎలాంటి బాలీవుడ్ ప్రాజెక్టులలో భాగం కాబోతుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X