శైలజారెడ్డి అల్లుడు వాయిదా వెనుక సమంత హస్తం.. అసలు సంగతి అదేనా!
అక్కినేని హీరో నాగ చైతన్య నటిస్తున్న తాజా చిత్రం శైలజారెడ్డి అల్లుడు. ఈ చిత్రంపై సినీవర్గాల్లో పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో శైలజారెడ్డి అల్లుడు చిత్రం ఊహించని విధంగా వాయిదా పడింది. కేరళ వరదల వలెనే ఈ వాయిదా అంటూ చైతు క్లారిటీ ఇచ్చాడు. కానీ ఈ చిత్రం వాయిదా వెనుక మరో కారణం ఉందంటూ ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనం ఆసక్తికరంగా మారింది.

కేరళ వరదలు
ఆగష్టు 31 న శైలజారెడ్డి అల్లుడు చిత్రం విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ చిత్ర రీ రికార్డింగ్ పనులు కేరళలో జరుగుతుండడం, అదేసమయంలో అక్కడ వరదలు రావడంతో చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు ఇటీవల చైతు ప్రకటించాడు.

మంచి అంచనాలతో
ఈ చిత్రంలో రమ్య కృష్ణ శైలజారెడ్డిగా టైటిల్ రోల్ పోషిస్తోంది. అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. మారుతి దర్శకత్వంపై వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

సమంత ప్రత్యేక శ్రద్ద
ఈ చిత్రం వాయిదా పడడం వెనుక సమంత హస్తం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. చైతు ఫిలిం కెరీర్ పై సమంత దృష్ఠి పెట్టిందట. అందుకే శైలజారెడ్డి చిత్ర విషయంలో సమంత ప్రత్యేక శ్రద్ద చూపిస్తోందని అంటున్నారు.

అందుకే వాయిదా
సమంత ఈ చిత్రంలో కొన్ని మార్పులు సూచించడం వలనే విడుదల వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. చైతు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాలంటే బ్లాక్ బస్టర్ హిట్ అవసరం. అందుకే శైలజారెడ్డి చిత్ర విషయంలో సమంత జోక్యం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











