సమంత ...ఐటం సాంగ్ పెడుతున్నారట

By Srikanya

హైదరాబాద్ : స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమంత ఐటం సాంగ్ చేయబోతోందనే వార్త ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ గా మారింది. అయితే అది మరేదో కాదు... కోన వెంకట్ సమర్పిస్తున్న గీతాంజలి చిత్రం కోసం అంటున్నారు. అయితే రెండు రోజుల క్రితం శృతి హాసన్ ఐటం సాంగ్ అనే వార్త వచ్చింది. ఇప్పుడు సమంత ఐటం సాంగ్ అనే వార్త రావటంతో ఏది నిజం అనేది మాత్రం తెలియటం లేదు. కోన వెంకట్ సోదరి కోన నీరజ తో తనకున్న స్నేహంతో సమంత ఈ ఐటం చేస్తోందని చెప్తున్నారు.

అంజలి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గీతాంజలి'. శ్రీనివాస్‌రెడ్డి, సత్యం రాజేష్‌ కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ నేపథ్య గళాన్ని అందిస్తున్నారు. రాజ్‌కిరణ్‌ దర్శకుడు. ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మాత. ప్రముఖ రచయిత కోన వెంకట్‌ సమర్పిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది.

Samantha item in Anjali’s Githanjali

కోన వెంకట్‌ మాట్లాడుతూ ''కథపై నమ్మకంతో నేనే ఈ చిత్రాన్ని నిర్మించాలనుకొన్నా. ఆ సమయంలోనే ఎం.వి.వి.సత్యనారాయణ పరిచయమయ్యారు. దీంతో మేమిద్దరం కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. గీతాంజలి అనే యువతి జీవితం చుట్టూ సాగే కథ ఇది. ఆ అమ్మాయి ఎవరన్నదే ఆసక్తికరం. ఉత్కంఠ, వినోదం మేళవింపుతో రూపొందుతున్న చిత్రమిది. బ్రహ్మానందం పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. ఆయనపై ప్రత్యేకంగా ఓ పాట ఉంది. దాన్ని త్వరలోనే విడుదల చేస్తాం. శ్రీనివాస్‌రెడ్డి, సత్యం రాజేష్‌, షకలక శంకర్‌ పాత్రలు కథను మలుపు తిప్పుతాయి. ''అన్నారు.

''అందరూ సొంత సినిమాలా భావించి పని చేశారు. అంజలి పాత్రతో పాటు సాయి శ్రీరామ్‌ కెమెరా పనితనం, ప్రవీణ్‌ లక్కరాజు సంగీతం చిత్రానికి బలాన్నిస్తాయి'' అన్నారు నిర్మాత. రావు రమేష్‌, అలీ, రఘుబాబు, ఝాన్సీ, వెన్నెల కిషోర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X