చైతూ ఫ్యామిలీకి షాకిచ్చిన సమంత.. ఎవరూ ఊహించని విధంగా అప్పగింతలు?

ఏం మాయ చేసావే సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన సమంత, నాగచైతన్య ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. అలా చాలా కాలం ప్రేమించుకున్న ఈ జంట తమ పెద్దల అంగీకారంతో ఎట్టకేలకు వివాహం కూడా చేసుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా 2021 సంవత్సరం అక్టోబర్ నెలలో తాము విడిపోతున్నాం అని అధికారికంగా ఈ జంట ప్రకటించింది. అయితే వీళ్ళు మళ్లీ కలిసే అవకాశం ఉందని భావిస్తున్న కొంత మంది ఫాన్స్ కి ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది. సమంత తన దగ్గర మిగిలి పోయిన కొన్ని వస్తువులను నాగచైతన్య కుటుంబానికి అందజేసినట్లు తాజా సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే

ఎవరూ ఊహించని విధంగా

ఎవరూ ఊహించని విధంగా

అక్కినేని, నాగచైతన్య సమంత ఇద్దరూ ఇష్టపడి పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ 2021 మే నెల నుంచి వారిద్దరూ విడిపోతున్నారు అంటూ ప్రచారం జరిగింది. దాదాపు మూడు నాలుగు నెలల ప్రచారం అనంతరం నాగచైతన్య తాను అధికారికంగా విడిపోవాలని నిర్ణయించుకున్నారు అంటూ సమంత తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఒకరకంగా ఇది ఫాన్స్ తో పాటు ఆ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా షాకింగ్ విషయం అనే చెప్పాలి.

అలాంటి అవకాశమే లేకుండా

అలాంటి అవకాశమే లేకుండా

వారిద్దరూ అధికారికంగా విడిపోయారు కానీ కొంత మంది అభిమానులు మాత్రం మళ్లీ సమంత నాగచైతన్య కలిసే అవకాశాలు ఉన్నాయి అంటూ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ విషయంలో ముందు నుంచి నాగ చైతన్య సమంత క్లారిటీగానే ఉన్నారు కానీ నాగచైతన్యకు సంబంధించిన కొన్ని వస్తువులు ఇంకా సమంత దగ్గరే ఉండడంతో ఏమో మళ్లీ కలిసే అవకాశాలు ఉన్నాయి అని వారి సన్నిహితులు కూడా కొంత మంది భావించారు. తాజాగా అలాంటి అవకాశమే లేకుండా సమంత నిర్ణయం తీసుకుంది.

ఏమాత్రం ఊహించలేదట

ఏమాత్రం ఊహించలేదట


తనకు నాగచైతన్య కుటుంబం నుంచి వచ్చిన పెళ్లి చీర సహా అనేక విలువైన వస్తువులను తాజాగా సమంత నాగచైతన్య కుటుంబ సభ్యులకు చేర వేసినట్లు తెలుస్తోంది. నాగచైతన్య కుటుంబ సభ్యులు వాటి గురించి అసలు ఆలోచించలేదని కానీ సమంత వాటన్నింటినీ తిప్పి పంపడంతో ఆమెకు నాగచైతన్య తో సంబంధం ఉన్న ఏ వస్తువులు ఉంచుకోవడం ఇష్టం లేదనే విషయం తేటతెల్లమైంది చెబుతున్నారు.

బిజీ బిజీగా

బిజీ బిజీగా


మరీ ముఖ్యంగా పెళ్లి చీర లాంటి వస్తువులను కూడా వెనక్కి పంపుతుందని ఏమాత్రం ఊహించలేదని అక్కినేని కుటుంబానికి సన్నిహితంగా ఉండే వారు కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. మరోపక్క సినిమాల విషయంలో సమంత చాలా ఫోకస్ పెట్టింది. వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది..

సినిమాల సంగతి

సినిమాల సంగతి


తెలుగులో ఆమె చేసిన శాకుంతలము అనే సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా యశోద సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. తమిళంలో నయనతారతో కలిసి ఆమె బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ డైరెక్షన్లో చేసిన సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. అలాగే సమంత ఒక ఇంటర్నేషనల్ ఫిలిమ్ కూడా ఒప్పుకున్న సంగతి తెలిసిందే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X