»   »  సమంత...ఆ బిజినెస్‌మేన్‌తో సహజీవనం చేస్తోందట?

సమంత...ఆ బిజినెస్‌మేన్‌తో సహజీవనం చేస్తోందట?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ సమంత, హీరో సిద్దార్ధ్ మధ్య ప్రేమాయణం ఉందనేది చాలా కాలంగా ప్రచారంలో ఉన్న వార్తలే. ఇటీవలే వీరు విడిపోయినట్లు కూడా మీడియాలో ప్రచారం జరిగింది. తాజాగా సమంత ఓ తమిళ వ్యపారవేత్తతో క్లోజ్ గా ఉంటుందనేది తమిళ మీడియాలో వినిపిస్తున్న వార్తలు. అతనికి తమిళ సినిమా రంగంతో సంబంధాలు ఉన్నాయని, కొన్ని తమిళ సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా పని చేసాడని టాక్. సమంత అతనితో కలిసి సహజీవనం చేస్తున్నట్లు కూడా తమిళ ఇండస్ట్రీలో చెవులు కొరుకుంటున్నారు. మరి ఈ వార్తలో నిజం ఎంతో తేలాల్సి ఉంది.

 Samantha live in relationship Business

సమంత సినిమాల విషయానికొస్తే... తమిళంలో '10 ఎనరదుకుళ్' చిత్రం చేస్తూ బిజీగా ఉంది. ఆమె తెలుగులో బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో నటించింది. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ 's/o స‌త్య‌మూర్తి' చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషించారు. ఇతర పాత్రల్లో సింధుతులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్ నటిస్తున్నారు. ఇటీవ‌లే స్పైయిన్ లొ స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, సమంత‌, నిత్యామీన‌న్ పై మూడు పాట‌లు చిత్రీక‌రించారు. ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన వస్తోంది.

ఈ సినిమా గురించి నిర్మాత ఎస్.రాధాకృష్ణ మాట్లాడుతూ... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్ర‌మ్‌ ల కాంబినేష‌న్ లో మా బ్యానర్లో చిత్రీకరిస్తున్న 's/o స‌త్య‌మూర్తి' చిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది. దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన పాటలిచ్చాడు. చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 2న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్ర ప్రమోషన్ ను సైతం విభిన్నంగా చేస్తున్నాం. ఇటీవలే హోళి సంద‌ర్బంగా మార్చి6న‌ ప్రీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు, అలాగే మార్చి7న ఎక్స్ టెండెడ్ ప్రీ లుక్ వీడియోకు , మార్చి 8న టైటిల్ లోగోకి, మార్చి9 న మోష‌న్ పోస్ట‌ర్స్ కి , మార్చి 10న విడుద‌ల చేసిన పోస్ట‌ర్ డిజైన్స్ కి, ఇటీవల విడుదలైన ఆడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అటు అభిమానులు ఇటు సాధారణ ప్రేక్షకులు సైతం ప్రీ లుక్ పోస్టర్స్, వీడియోను అంతగా లైక్ చేస్తున్నారంటే ఆ క్రెడిట్ మొత్తం అల్లు అర్జున్, త్రివిక్రమ్ కే చెందుకుంది. ఈ చిత్ర ప్రమోషన్ ను సైతం డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నాం. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పెర్ ఫార్మెన్స్ మ‌రియు ల‌క్ ఈ సినిమాకు హైలైట్ కానుంది. ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ పాత్రలు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. అని అన్నారు.

    English summary
    Film Nagar source said that, Actress Samantha live in relationship with a Tamil Businessman.
    Please Wait while comments are loading...
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu