రామ్ చరణ్ ‘ఎవడు’ నుంచి సమంత ఔట్?
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' చిత్రానికి కమిట్ అయిన విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈచిత్రంలో సమంత హీరోయిన్. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈచిత్రం నుంచి తప్పకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈవిషయం ఇంకా అధికారికంగా కన్ ఫర్మ్ కావాల్సి ఉంది.
జులై 20వ తేదీనే సమంత షూటింగులో పాల్గొనాల్సి ఉండగా కానీ ఇప్పటి వరకు ఆమె రాలేదని యూనిట్ వర్గాల సమాచారం. అంతకు ముందు అనారోగ్యం పాలైన సమంత మణిరత్నం సినిమాతో పాటు శంకర్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ 'ఐ' చిత్రంలో కూడా అవకాశం కోల్పోయింది. ఎవడు చిత్రం సమంత కోల్పోయిన మూడో చిత్రం అవుతుంది.
సమంత నటించిన సినిమాలన్నీ విజయం సాధిస్తుండటంతో ఆమె చేతిలో బోలెడు సినిమాలు ఉన్నాయి. గౌతం మీనన్ దర్శకత్వంలో నాని సరసన ఎటోవెళ్లి పోయింది మనసు, దేవా కట్ట దర్శకత్వంలో నాగచైతన్య సరసన ఆటో నగర్ సూర్య, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు సరసన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నందినిరెడ్డి దర్శకత్వంలో సిద్ధార్థ సరసన ఓ సినిమాలకు కమిట్ అయింది.
ఈ నేపథ్యంలో డేట్స్ రామ్ చరణ్ 'ఎవడు' మూవీ కోసం ఇచ్చిన డేట్స్ అడ్జెట్స్ కాక పోవడంతో ఈ సమస్య వచ్చినట్లు సమాచారం. ఎవడు దర్శక నిర్మాతలు కూడా సమంత కోసం మొత్తం షెడ్యూల్ మార్చుకోవడానికి సిద్దంగా లేరని, ఆమె స్థానంలో వేరే హీరోయిన్ ను తీసుకునే అవకాశం ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.


Click it and Unblock the Notifications











