సమంత 'మా ఇంటి బంగారం'కి బ్రేక్.. ఆ హీరోనే కారణమా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు (Samantha Ruth Prabhu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మూవీ 'మా ఇంటి బంగారం' ( Maa Inti Bangaram). దర్శకురాలు నందిని రెడ్డి ( Nandini Reddy) తెరకెక్కిస్తున్న ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. 'ఓ బేబీ' తర్వాత ఈ కాంబినేషన్ మళ్లీ కలిసి పని చేయడం, అంతేకాక సమంత స్వయంగా తన బ్యానర్‌పై నిర్మాణంలో భాగస్వామి కావడం వల్ల ఈ ప్రాజెక్ట్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. అయితే.. ఈ సినిమా విడుదల వాయిదా వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా ఆ స్టార్ హీరో కారణంగా సమంత వెనక్కి తగ్గిందట. ఇంతకీ ఆ స్టార్ ఎవరు? అసలు కారణాలేంటీ?

'మా ఇంటి బంగారం' సమంత కెరీర్‌లో చాలా స్పెషల్ సినిమా. ఆమె వ్యక్తిగత జీవితంలో జరిగిన మార్పుల తర్వాత, పూర్తిగా తన కెరీర్‌పై దృష్టి పెట్టిన సమంత ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో ఆమె ఒక సాధారణ గృహిణిగా కనిపిస్తూనే, కుటుంబాన్ని రక్షించేందుకు పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లలో కనిపించనుంది. ఈ సినిమాలో గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచలే, గౌతమి, శ్రీముఖి, సత్యరాజ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతాన్ని సంతోష్ నారాయణన్ అందిస్తుండగా, కథ-స్క్రీన్‌ప్లే విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది.

Samantha Maa Inti Bangaram Postponed Ram Charan Clash Behind Delay Buzz

ఇక ఈ సినిమాను మే 15, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించారు. టీజర్లు, సాంగ్స్ ద్వారా మంచి బజ్ కూడా క్రియేట్ చేశారు. అయితే విడుదల తేదీ దగ్గరపడుతున్నప్పటికీ ప్రమోషన్లు ప్రారంభం కాకపోవడంతో వాయిదా వార్తలు వినిపించడం మొదలైంది. ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ పీక్‌లో ఉండటం ఒక ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఈ సమయంలో ప్రేక్షకులు ఎక్కువగా క్రికెట్‌పైనే దృష్టి పెట్టడం వల్ల సినిమాలకు ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రావడం కష్టమవుతుంది. దీంతో డిస్టిబ్యూటర్స్ సలహా మేరకు మే రేస్ నుంచి తప్పుకోవాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

జూన్ రిలీజ్ ప్లాన్.. కానీ అక్కడ కూడా క్లాష్!
ఇలా ఐపీఎల్ ఎఫెక్ట్ తో మే నుంచి వాయిదా వేసిన... ఈ సినిమాను జూన్ 4న విడుదల చేయాలని యోచించినట్లు టాక్ వచ్చింది. అయితే అదే తేదీకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న 'పెద్ది' సినిమా విడుదలకు సిద్ధమవుతుండటంతో పరిస్థితి మళ్లీ క్లిష్టమైంది. భారీ క్రేజ్ ఉన్న స్టార్ హీరో సినిమా ఎదురుగా విడుదల చేస్తే 'మా ఇంటి బంగారం' ఓపెనింగ్స్‌పై ప్రభావం పడే అవకాశం ఉండటంతో ఆ తేదీని కూడా మేకర్స్ డ్రాప్ చేసినట్లు తెలుస్తోంది. ఇక జూన్ నెలలోనే ఇతర సినిమాలు కూడా లైన్‌లో ఉండటంతో, సోలో రిలీజ్ దొరకడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో జూన్ చివరి వారంలో గానీ, జూలై మొదటి వారంలో గాని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇలా సమంత సినిమా వాయిదా వెనుక పరోక్షంగా రామ్ చరణ్ సినిమా ప్రభావం ఉందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. జూన్ 4 స్లాట్‌పై 'పెద్ది' టీమ్ ముందుగానే కన్నేయడంతో, సమంత సినిమా ఆ డేట్‌ను వదులుకోవాల్సి వచ్చిందని అంటున్నారు. దీంతో "ఒక స్టార్ హీరో మూవీ వల్లే సమంత సినిమా వాయిదా పడిందా?" అన్న చర్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే సమయంలో సమంత-నందిని రెడ్డి కాంబో మరోసారి మ్యాజిక్ చేస్తుందా? లేదా వాయిదా ప్రభావం పడుతుందా? అన్నది చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X