»   » సమంత పెళ్లాడబోయేది ఇతగాడేనా..? (లీక్ ఫోటో)

సమంత పెళ్లాడబోయేది ఇతగాడేనా..? (లీక్ ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవలే తన ప్రేమ విషయాన్ని, పెళ్లి విషయాన్ని బయట పెట్టిన సంగతి తెలిసిందే. తాను ఓ అబ్బాయిని ప్రేమిస్తున్నానని, త్వరలోనే పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించింది. అయితే అతను ఎవరు? అనే విషయాన్ని మాత్రం సమంత బయట పెట్టలేదు.

సమంత ఈ విషయం చెప్పినప్పటి నుండి ఆమె ఎక్కడికెళ్లినా... మీరు పెళ్లాడబోయే వ్యక్తి ఎవరు? మీ మనసు దోచిన ఆ యంగ్ హీరో ఎవరు? అంటూ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా సమంత ప్రేమ గురించి, పెళ్లి గురించి చాలా ప్రచారం జరుగుతోంది.

sam

ఈ గోల తట్టుకోలేక సమంత ఇటీవల దయచేసి నా పెళ్లి గురించి డిస్క్రషన్ ఆపండి.... నేను స్వయంగా చెప్పే వరకు ఎవరూ మళ్లీ దీని గురించి మాట్లాడొద్దు అంటు రిక్వెస్ట్ చేసింది. అయితే సమంత రిక్వెస్ట్ చేస్తే మాత్రం ఎవరు ఆగుతారు చెప్పండి? ఈ విషయంలో ఎవరికి వారు తమతమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

తాజాగా ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. సమంత పెళ్లాడబోయేది యంగ్ హీరో నాగ చైతన్యనే అని అంటున్నారు. ఇటీవల ఈ ఇద్దరూ కలిసి 'అ...ఆ' సినిమా కలిసి చూసారు. ఎవరో వీరు కలిసి సినిమా చూస్తుండగా ఫోటో క్లిక్ మనిపించారు.

తన తొలి సినిమా 'ఏమాయ చేసావే' సినిమా దగ్గర నుండి సమంత, నాగ చైతన్య చాలా క్లోజ్. ఇద్దరూ కలిసి ఇప్పటి వరకు చాలా సినిమాలు చేసారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని అంటున్నారు. పైగా సమంత ఇప్పటి వరకు ఇంటిమేట్ సీన్లు, ముద్దు సీన్లు ఎక్కువగా చేసింది నాగ చైతన్యతోనే. పైగా ఇటీవల సమంత ఇచ్చిన కొన్ని క్లూస్ పరిశీలిస్తే అవి నాగ చైతన్యకు బాగా సూటవుతున్నాయి.

తనకు కాబోయే వాడు కాబట్టే... కేవలం నాగ చైతన్యను మాత్రమే తీసుకుని తన పాత్రే ప్రధానంగా సాగే 'అ..ఆ' సినిమాకు రహస్యంగా వచ్చిందని అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ బయట మాత్రం ప్రచారం జోరందుకుంది. సమంతగానీ, నాగ చైతన్య గానీ ఈ విషయంలో స్పందిస్తే బావుంటుంది.

English summary
Film Nagar source saud that Samantha to marry Akkineni star Naga Chaitanya.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu