twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సమంతను అలా ఊహించుకోగలమా, 70 ఏళ్ల వయసున్న పాత్రలో...?

    By Bojja Kumar
    |

    సమంత పేరు తలుచుకోగానే చూడచక్కనైన గ్లామర్ తార మనకళ్ల ముందు కదలాడుతున్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పటి వరకు అభిమానులు ఆమెను హాట్ లేడీగా, క్యూట్ లేడీగా, అందమైన భార్యగా, చిలిపి పనులు చేసే ప్రియురాలిగా, బావను ఆటపట్టించే మరదలు పాత్రల్లో చూశాం. కానీ త్వరలో సమంత ఎవరూ ఊహించని పాత్రలో, అది కూడా 70 ఏళ్ల వృద్ధురాలిగా కనిపించబతోందట.

    ప్రస్తుతం 'యూ టర్న్‌' అనే కన్నడ రీమేక్ చిత్రంతో నటిస్తున్న సమంత త్వరలో కొరియన్‌ సినిమా రీమేక్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. అక్కడ సూపర్ హిట్ అయిన 'మిస్‌ గ్రానీ' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారని, ఇందులో గ్రానీ పాత్రలో సమంత నటించబోతోందని టాక్.

    Samantha in ‘Miss Granny’ remake?

    టాలీవుడ్ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహించే ఈ సినిమాను ప్రముఖ తెలుగు సినీ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్‌ ప్రొడ్యూస్ చేయబోతోందట. అయితే ఈ విషయమై అఫీషియల్ సమాచారం అయితే లేదు.

    2014లో వచ్చిన ఈ చిత్రాన్ని వాంగ్‌ డాంగ్‌ హ్యుక్‌ రూపొందించారు. 70 ఏళ్ల వృద్ధురాలు స్టూడియోలో ఫొటో తీయించుకుంటుంది. ఆ ఫొటో దిగిన కొన్ని రోజుల తర్వాత అచ్చం తనలాగే ఉన్న 20 ఏళ్ల యువతి కనపడుతుంది. ఆ యువతిని చూసి బామ్మ ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత ఏం జరుగింది? అనే ఆసక్తికర అంశాలకు కామెడీ జోడించి రూపొందించారు.

    English summary
    Samantha Akkine is rumoured to star in the 2014 South Korean blockbuster ‘Miss Granny’. While an official confirmation is awaited, ‘Kalyana Vaibhogame’ fame Nandini Reddy might direct the comedy drama.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X