మహేష్ కి ఇచ్చిన డేట్స్ వల్లే సమంతాకి బాధ
'ఏ మాయ చేసావె' చిత్రంలో జెస్సీగా అదరకొట్టిన సమంతాకి తాజాగా ఓ పెద్ద ఆఫర్ మిస్సయిందని సమాచారం. ప్రభాస్ హీరోగా రాజమౌళి కాంబినేషన్లో త్వరలో ప్రారంభం కానున్న చిత్రం కోసం ఆమెను అడిగారు. అయితే మహేష్ సినిమా డేట్స్‌తో ఆ సినిమా డేట్స్ కూడా క్లాష్ అవుతుండటంతో ఆ సినిమాను సమంతా వదులుకుంది. ఆ ఛాన్స్‌ను మిస్ అయినందుకు సమంతా తన సన్నిహితులతో చెప్పుకుని బాధపడతోంది. అయితే మహేష్ లాంటి స్టార్ తో సినిమా అనుకున్నప్పుడు ఇలాంటివన్నీ త్యాగం చెయ్యాల్సిందే అని సర్ధిచెప్తున్నారు. ప్రస్తుతం సమంత..ఎన్టీఆర్ సరసన 'బృందావనం' చేస్తోంది. మహేష్ బాబు, శ్రీను వైట్ల కలయికలో రూపొందనున్న చిత్రం సెట్స్ మీదకు వెళ్ళటానికి మరికొమంత టైమ్ పట్టేటట్లు ఉంది. అలాగే రాజమౌళి ప్రస్తుతం సునీల్ హీరోగా మర్యాద రామన్న చిత్రం చేస్తూ బిజీగా ఉన్నారు.
మహేష్ బాబు రాజమౌళి శ్రీను వైట్ల సమంత ఏ మాయ చేసావె నాగచైతన్య mahesh babu rajamouli srinu vytla samantha ye maya chesave naga chaitanya


Click it and Unblock the Notifications