విడాకుల వివాదం : శిల్పా శెట్టి బాటలో సమంతా.. అదే జరిగితే క్లారిటీ వచ్చినట్టే!
గత కొద్ది రోజులుగా నాగచైతన్య సమంత ల వివాహం రద్దు విషయం సంచలనంగా మారుతోంది. అసలు ఈ విషయం మీద వారిద్దరి తరపు నుంచి ఎలాంటి ప్రకటన లేకపోయినా ఊహాగానాలు మాత్రం బాగానే తిరుగుతున్నాయి. సమంత సోషల్ మీడియాలో అక్కినేని అనే పేరు తీసేయడంతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా ఈ విషయం మీద కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

అలా ప్రేమలో పడి
ఏం మాయ చేసావే సినిమాలో కలిసి నటించిన సమంత నాగచైతన్య చాలా కాలం తర్వాత ప్రేమలో పడ్డారు. తర్వాత ఇరు వర్గాల వారిని ఒప్పించి క్రైస్తవ సంప్రదాయం తో పాటు హిందూ సంప్రదాయం ప్రకారం గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా చేసుకున్నారు. అయితే పెళ్లి జరిగినప్పటి నుంచి నాగార్జున సమంత మీద ఎప్పటికప్పుడు ఫైర్ అవుతున్నారు అంటూ మీడియాలో వార్తలు వస్తూ ఉండేవి.

పెళ్లి తర్వాత
నాగార్జున భార్య అమల లాగానే సమంత కూడా సినిమాలకు దూరమై ఇంటికే పరిమితం కావాలి అనేది అక్కినేని కుటుంబ సభ్యుల కోరిక కాగా సమంత మాత్రం పెళ్ళి తర్వాత కూడా సినిమాలు చేస్తూనే ఉందని ఈ విషయంలో నాగచైతన్య సమంత మధ్య దూరం పెరిగింది అనేది మీడియా వర్గాల్లో జరుగుతున్న ప్రచారం.

నో కామెంట్స్
అయితే ఈ విషయం మీద అటు అక్కినేని ఫ్యామిలీ నుంచి గాని నాగచైతన్య గాని లేదా సమంత గాని ఎవరు సమర్ధించింది కానీ ఖండించింది కానీ లేదు. అయితే ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా వాళ్లని నవ్వుతూ పలకరించే సమంత తిరుమల పర్యటనలో మాత్రం బుద్ధుందా అని ప్రశ్నించడంతో వీళ్లిద్దరి మధ్య ఈ వ్యవహారం చాలా సీరియస్ గానే ఉందనే వార్తలు బయటకు వచ్చాయి.

నిజమే అనిపించేలా
దానికి తగ్గట్లుగానే లవ్ స్టోరీ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న నాగచైతన్య పబ్లిక్ రిలేషన్స్ టీం కూడా ఈ ప్రమోషన్స్ కోసం హాజరయ్యే మీడియా ప్రతినిధులు ఎవరు చైతన్య దగ్గర పర్సనల్ విషయాలు కానీ ఈ విడాకుల వ్యవహారం మాట మాత్రం కూడా ఎత్తకూడదు అన్ని నిబంధనలు పెట్టారు.

శిల్పా శెట్టి
ఇంత హడావుడి జరుగుతూ ఉండడంతో ఇదంతా నిజమేనేమో అని అటు మీడియా వాళ్లు కూడా నమ్మాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే కొన్ని మీడియా పోర్టల్స్ అయితే ఒక అడుగు ముందుకు వేసి మరి సమంత 50 కోట్ల రూపాయల భరణం కూడా నాగచైతన్య నుంచి కోరుతోందని వార్తలు ప్రచురించాయి. అయితే ఈ విషయం మీద ఎలాంటి స్టెప్ తీసుకోకపోతే ఇంకా ఇంకా దిగజారే ఎక్కడ వార్తలు రాస్తారేమో అనే భయంతో సమంత ఈ విషయం మీద కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉందని అంటున్నారు.

బ్రేకులు వేస్తుందా?
తన పరువుకు భంగం కలిగించేలా ఎలాంటి విషయాలను తన గురించి గానీ తన భర్త నాగచైతన్య గురించి గానీ ప్రచురించకుండా కోర్టును ఆమె అప్రోచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.. నిజానికి రాజ్ కుంద్రా అరెస్టు సమయంలో శిల్పాశెట్టి గురించి అనేక విధాలుగా రాస్తున్న నేపథ్యంలో శిల్పాశెట్టి కూడా ఇదే విధంగా కోర్టును ఆశ్రయించింది. అయితే శిల్పాశెట్టి గురించి పర్సనల్ విషయాలేవీ రాయడం లేదు కేవలం రాజ్ కుంద్రా కేసుకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉండడంతో కోర్టు కూడా పెద్దగా స్పందించలేదు.


Click it and Unblock the Notifications











