Samantha చికిత్సకు కోట్లల్లో ఖర్చు.. హీరో దగ్గర అప్పు తీసుకున్న సమంత?
దక్షిణాది సినీ పరిశ్రమలో అగ్ర కథానాయికల్లో ది మోస్ట్ బ్యూటిఫుల్ సమంత ఒకరు. తమిళనాడుకు చెందిన ఈ బ్యూటి ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తొలి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఈ చిన్నది అతి తక్కువ కాలంలోనే అగ్ర హీరోలతో నటించింది. అవి కూడా విజయం సాధించడంతో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం సామ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకే విదేశాల్లో టూర్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తుంది. అయితే మయోసిటీస్ కోసం సమంత చేయనున్న ఖర్చు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
హిట్ అండ్ ప్లాప్:స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అయితే అంతకుముందు హిట్లు ప్లాపులు తేడా లేకుండా ఏదో ఒక చిత్రం చేస్తూ ఫుల్ బిజీగా ఉండేది. ఎక్కువగా లేడీ ఒరియెంటెడ్ చిత్రాలు చేసి ఆకట్టుకుంది. అందులో యశోద సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వగా.. శాకుతంలం మాత్రం ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.

సెప్టెంబర్ 1న:సమంత ఇప్పటికే రెండు మూడు చిత్రాలను పూర్తి చేసింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా, సిటాడెల్ ఇండియన్ వెర్షన్, ది చెన్నై స్టోరీ వంటివి ప్రస్తుతం సమంత చేతిలో ఉన్న సినిమాలు. అదే విడుదల కావడానికి రెడీగా ఉన్న సినిమాలు. సిటాడెల్ షూటింగ్ ను పూర్తి కాగా.. ఖుషి సినిమా సెప్టెంబర్ 1న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
కోలుకున్నాకే అలా:ది చెన్నై స్టోరీ సినిమాలో సమంత నటించిందా లేదా అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే ఆ మధ్య ఆ సినిమాలో సమంతకు బదులు శ్రీలీలను తీసుకున్నట్లు టాక్ వచ్చింది. మరి ఈ హాలీవుడ్ మూవీలో సామ్ ఉందా లేదా అనేది ఏదైనా అప్డేట్ వస్తే కానీ స్పష్టత రాదు. ఇదిలా ఉంటే మయోసైటిస్ అనే వ్యాధితో సమంత బాధ పడుతున్న విషయం తెలిసిందే. దాని నుంచి కాస్తా కోలుకున్న తర్వాతే సామ్ సినిమాలు ఒప్పుకుని పూర్తి చేసింది.

అమెరికాకు సామ్:ప్రస్తుతం సమంత ఇండోనేషియాలోని బాలి టూర్ లో ఉంది. వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు పెడుతూ హైలెట్ అవుతోంది. అలాగే ఫిట్ నెస్ వీడియోలు, ఫొటోలతో గ్లామర్ ట్రీట్ అందిస్తోంది. ఇదిలా ఉంటే మయోసిటీస్ నుంచి పూర్తిగా కోలుకునేందుకు మెరుగైన చికిత్స తీసుకోనుందట సామ్. అందుకోసం అమెరికా వెళ్లనుందని జోరుగా ప్రచారం సాగుతోంది.

హీరో దగ్గర అప్పు:అంతేకాకుండా సమంత తన మయోసిటిస్ చికిత్స కోసం రూ. 25 కోట్లు ఖర్చు చేయనుందని ప్రస్తుతం వినిపిస్తున్న టాక్. అయితే ఇంత మొత్తాని ఓ హీరో దగ్గర అప్పుగా సమంత తీసుకుందని మరో రూమర్ జోరుగా వ్యాపిస్తోంది. చికిత్స కోసం రూ. 25 కోట్లు ఖర్చు కానుండటం నిజం కావొచ్చు కానీ, అప్పు తీసుకునేంత పరిస్థితిలో సమంత లేదని చెబుతున్నారు. సినిమాలతో ఆస్తి బాగానే సంపాదించిన సమంతకు అప్పు తీసుకునే అవసరం ఏముందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియరావాలి.


Click it and Unblock the Notifications











