చైతూ, సామ్ ఐదోసారి.. ఈసారి మరింత రొమాంటిక్‌గా
సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్స్ లో ఒకరైన నాగ చైతన్య - సమంత జోడి మరోసారి బిగ్ స్క్రీన్ పై కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. 'ఏ మాయ చేసావె' సినిమాతో మొదటిసారి కలిసి నటించిన ఈ జంట అప్పుడే వారి అందమైన హిట్టుతో అసలైన కెరీర్ ని మొదలుపెట్టారు. ఆటోనగర్ సూర్య చేసిన తరువాత స్నేహితులుగా కొనసాగుతూ మరింత దగ్గరైన చైసామ్ ప్రేమ యాత్రలు గట్టిగానే కొనసాగించారు.
మనం సినిమాతో మెప్పించిన అనంతరం చైసామ్ పెళ్లితో ఒకటై కెరీర్ ను మరీంత ముందుకు తీసుకెళ్లారు. అయితే పెళ్లి తరువాత వారు చేసిన ఒకే ఒక్క సినిమా మజిలీ. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అప్పటివరకు డిజాస్టర్ సినిమాలతో సతమతమైన చైతుకి కూడా మజిలీ మంచి బూస్ట్ ఇచ్చింది. దీంతో మరొకసారి వీరిని తెరపై చూపించేందుకు చాలా మంది దర్శకులు ప్రయత్నించారు.

ఫైనల్ గా లేడి డైరెక్టర్ నందిని రెడ్డి సమంత నాగ చైతన్యల కొత్త డేట్స్ ని లాక్ చేసుకుంది. లాక్ డౌన్ తరువాత మళ్ళీ చైసామ్ ఒకే సినిమాలో కలిసి నటించనున్నారు. 'ఓ బేబి' సినిమాతో సమంతకు సోలో సక్సెస్ ఇచ్చిన నందిని రెడ్డి ఆ తరువాత మరొక రొమాంటిక్ కథను సెట్ చేసుకుంది. ఆ కథ విని ఇంప్రెస్ అయిన సమంత తన భర్తతో మరోసారి కొత్త తరహా రొమాంటిక్ సినిమా చేస్తే బావుంటుందని ప్లాన్ చేసిందట. ప్రస్తుతం ఈ న్యూస్ ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఐదవ సారి ఈ జోడి ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











