Samantha Naga Chaitanya: పెళ్లి కోసం ఒక్కటవనున్న సమంత నాగచైతన్య?
మెగా ఇంట పెళ్లి సందడి మొదలైన సంగతి అందరికీ తెలిసిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి కొన్నేళ్లుగా ప్రేమలో ఉండి.. ఇటీవల పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక వీరి వివాహం మరికొద్ది గంటల్లో జరగబోతుంది. ఇక వీరి పెళ్లి ఏర్పాట్లను రామ్ చరణ్ దంపతులు దగ్గరుండి చూసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. వీరి పెళ్లి కోసం.. నాగచైత్యన, సమంత కలవబోతున్నారు. విడాకుల తర్వాత వీరు ఒక్కచోట కనిపంచబోతున్నారు. అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నాగ చైతన్య, సమంత.. ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక వీరి ప్రేమకు ఆ మధ్య పుల్ స్టాప్ పెట్టి.. విడాకులు తీసుకుంటున్నట్లు చెప్పుకువచ్చారు. రీజన్ ఏదైనా.. టాలీవుడ్ లో బెస్ట్ కపూల్స్ గా ఉండే వీరు.. విడిపోయారు. ఇక సినీ ప్రేక్షకులే కాదు. సామాన్యులు సైతం నోరెళ్ల బెట్టారు. ఇక విడాకుల అనంతరం వీరు ఎవరి లైఫ్ ల్లో వారు బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక పాన్ ఇండియా సినిమాలు చేస్తూ సమంత బిజీగా ఉండగా.. నాగచైతన్య హిట్ కోసం పరితపిస్తున్నాడు.

ఇక ఇదిలా ఉండగా వీరు వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి కోసం ఒక్కటవబోతున్నారు. వరుణ్ తేజ్, లావణ్య ఎంత కాలం ప్రేమించుకున్నారు. ఇటీవల పెద్దలకు చెప్పి నిశ్చితార్థంగా ఘనంగా జరుపుకున్నారు. ఇక ఇప్పుడు పెళ్లి కూడా అంగ రంగ వైభవంగా ఇటలీలో జరగబోతుంది. ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. ఇటలీలో వీరి వివాహం నవంబర్ 1న అంగరంగ వైభవంగా ఇరు పెద్దల సమక్షంలో జరగనుంది. మధ్యాహ్నం 2.48నిమిషాలకు వీరి పెళ్లి ముహూర్తం నిశ్చయించారు.
ఇక వీరి పెళ్లి కోసం ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి కుటుంబ సభ్యులు అంతా కదిలివెళ్లారు. మరో వైపు అల్లు ఫ్యామిలీ సైతం వెళ్లి ఎంజాయ్ చేస్తోంది. ఇక అక్కడి ఫోటోలను ఉపాసన, రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఇప్పటికే హల్దీ, మెహందీ , సంగీత్ వేడుకలు జరుగాయి. ఇక గత రాత్రి జరిగిన కాక్ టైల్ పార్టీలో మెగా, అల్లు కుటుంబాలు ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక వరుణ్ తేజ్, లావణ్యల పెళ్ళికి ఇండస్ట్రీ నుంచి కేవలం నలుగురు మాత్రమే హాజరుకానున్నట్లు సమాచారం. ఇప్పటికే వరుణ్ పెళ్ళికి హీరో నితిన్.. కుటుంబంతో సహా ఇటలీ బయలుదేరాడు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ పెళ్ళికి మాజీ జంట హాజరుకానున్నట్లు తెలుస్తోంది. వరుణ్, లావణ్యల పెళ్లి కోసం.. నాగచైతన్య, సమంత పెళ్లికి బయలుదేరారు. అయితే వేరే వేరే ఫ్లైట్స్ లోనే వేరుగానే వెళ్లారని తెలుస్తోంది.
అయితే అక్కడికి వెళ్లాకా.. నాగ చైతన్య, సమంత మాట్లాడుకుంటారా... లేదా అనేది ఆసక్తిగా మారింది. అంతే కాదు.. వీరు విడిపోయిన తర్వాత మొదటి సారి కలుస్తున్నది ఇక్కడే. మరి వీరు అక్కడైనా కలిసి మాట్లాడుకుంటారా.. ? లేదా ఎవరి దారిన వారు వెళ్లి వచ్చేస్తారా అనేది తెలియాలి. ఇక రష్మిక కూడా హాజరు కానుందని తెలుస్తోంది. వీళ్లే కాకుండా.. ఇంకా ఎవరైనా వెళ్తారా లేదా అనేది పెళ్లి ఫోటోలు వచ్చాకే తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











