»   » రాంచరణ్, సమంత.. హిట్ కాంబినేషన్ రిపీట్ కానుందా, రాజమౌళి సినిమాలో!

రాంచరణ్, సమంత.. హిట్ కాంబినేషన్ రిపీట్ కానుందా, రాజమౌళి సినిమాలో!

Subscribe to Filmibeat Telugu

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రం రికార్డు విజయం సాధించింది. టాలీవుడ్ లో ఉన్న నాన్ బాహుబలి రికార్డులన్నీ ఈ చిత్రం తుడిచి పెట్టేసిన సంగతి తెలిసిందే. రంగస్థలం చిత్రం బయ్యర్లకు భారీ లాభాలని తెచ్చిపెట్టింది. ఈ చిత్రం అందించిన ఉత్సాహంతో రాంచరణ్ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్నాడు. బోయపాటి శైలి ఈ చిత్రం మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండబోతోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. బోయపాటి చిత్రం తరువాత రాంచరణ్, ఎన్టీఆర్ కలసి నటించాల్సిన అసలు సిసలైన ప్రాజెక్ట్ రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా భారీ మల్టి స్టారర్ చిత్రానికి రంగం సిద్ధం అవుతోంది. ఈ చిత్రాన్ని రాజమౌళి ప్రకటించాడేకాని చిన్న విశేషం కూడా బయటపెట్టలేదు. తాజగా ఓ ఆసక్తికర విషయం ఈ చిత్రం గురించి ప్రచారం జరుగుతోంది.

రామలక్ష్మి, చిట్టిబాబు మ్యాజిక్

రామలక్ష్మి, చిట్టిబాబు మ్యాజిక్

రంగస్థలం చిత్రంలో చిట్టిబాబు, రామలక్ష్మి పాత్రలని అంత సులువుగా మరచిపోలేము. ఆ పాత్రలో రాంచరణ్, సమంత అంతలా మ్యాజిక్ చేశారు. వినికిడి లోపం ఉన్న పాత్రలో రాంచరణ్, పల్లెటూరి యువతిగా సమంత అద్భుత నటన కనబరిచిన సంగతి తెలిసిందే.

రిపీట్ చేస్తాడా

రిపీట్ చేస్తాడా

రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని ప్రకటించాడు కానీ చిత్రానికి సంబందించిన వివరాలు బయట పట్టలేదు. ప్రస్తుతం జక్కన్న నటీనటుల్ని ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా రాంచరణ్ కు జోడిగా సమంతని నటింపజేసే అవకాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది. రంగస్థలంలో సమంత, చరణ్ నటన అదుర్స్ అంటూ రాజమౌళి ప్రశంసించిన సంగతి తెలిసిందే. అన్ని కుదిరితే రాంచరణ్, సమంత సూపర్ హిట్ కాంబినేషన్ రిపీట్ కావడం ఖాయం అని సినీ వర్గాలు అంటున్నాయి.

బిజీగా ఉన్న చరణ్, ఎన్టీఆర్

బిజీగా ఉన్న చరణ్, ఎన్టీఆర్

రాంచరణ్, ఎన్టీఆర్ వారి వారి చిత్రాలతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తుంటే, రాంచరణ్ బోయపాటి చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాలు పూర్తయ్యాక ఆర్ ఆర్ ఆర్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ లోపు రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ పనులని పూర్తి చేయనున్నాడు.

భారీ బడ్జెట్

భారీ బడ్జెట్

ఆర్ ఆర్ ఆర్ ప్రాజెక్ట్ భారీ బడ్జెట్ తో రూపొందబోతున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని దాదాపు 300 కోట్ల బడ్జెట్ లో రూపొందిస్తారట. డివివి దానయ్య ఈ చిత్రానికి నిర్మాత.

English summary
Samantha once again to romance with Ram Charan. Rajamouli considering Samantha as female lead to Ram Charan in RRR
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X