సమంతను ఇచ్చాకే ఓకే అన్న ప్రభాస్?
దశరధ్, ప్రబాస్ కాంబినేషన్లో మొదలైన సినిమా ఐదు రోజుల షూటింగ్ అనంతరం ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే రకరకాల కారణాలు చెప్తున్నప్పటికీ ముంబై నుంచి తెచ్చిన కొత్త హీరోయిన్ నచ్చకపోవటమే ప్రధానంగా వినిపిస్తున్న రీజన్. ప్రబాస్ కూడా దాంతో చాలా అసంతృప్తిగా ఉన్నారు. దాంతో దిల్ రాజు వెంటనే దీనికి పరిష్కార మార్గంగా సమంతాను భావించారు. దాంతో ఆమెను ఒప్పించి ఈ ప్రాజెక్టులోకి తీసుకువచ్చారని తెలుస్తోంది. ఈ వార్త తెలిసాక ప్రభాస్ కూల్ అయినట్లు సమాచారం. అయితే ఇప్పుడు సమంతా ఎన్టీఆర్ సరసన బృందావనం చిత్రం షూటింగ్ లో బిజీగా ఉంది. ఆ చిత్రాన్ని దిల్ రాజే నిర్మిస్తున్నారు. దాంతో ఆ చిత్రం షెడ్యూల్ అనంతరం గ్యాప్ లో ఈ డేట్స్ ఎడ్జెస్ట్ చేస్తానన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ఎక్కువ భాగం అమెరికా లో జరగనుంది. ఇక ప్రభాస్ హీరోగా చేసిన డార్లింగ్ చిత్రం ఈ నెల 23న రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











