వదిన మాట వింటాడా..? అఖిల్ కోసం భారీ ప్లాన్ సెట్ చేసిన సమంత

బాక్సాఫీస్ వద్ద ఇంతవరకు మొదటి సక్సెస్ చూడని అక్కినేని అఖిల్ నెక్స్ట్ సినిమాలతో ఎలాగైనా భారీ స్థాయిలో హిట్ కొట్టాలని కష్టపడుతున్నాడు. ఎలాంటి సినిమా చేసినా కూడా వర్కౌట్ కాకపోవడంతో అఖిల్ కోసం వదిన సమంత రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇటీవల అతనికి బాలీవుడ్ నుంచి ఒక మంచి కాన్సెప్ట్ ను తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

ప్రభాస్ - రాకీ భాయ్: Salaar Movie Pooja & Launch Photos

ఎలాంటి పోటీ లేని సమయంలోనే..

ఎలాంటి పోటీ లేని సమయంలోనే..

అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే ఆ సినిమా గత ఏడాది సమ్మర్ లోనే రావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇక వీలైనంత వరకు ఎలాంటి పోటీ లేని సమయంలోనే ఆ సినిమాను విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు.

మార్కెట్ ను మరింత పెంచుకోవాలని..

మార్కెట్ ను మరింత పెంచుకోవాలని..

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇక ఆ సినిమా తరువాత అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుండడంతో ఎలాగైనా ఆ సినిమాతో తన మార్కెట్ ను మరింత పెంచుకోవాలని చూస్తున్నాడు.

బాలీవుడ్ ఆఫర్స్ చాలానే వచ్చాయట

బాలీవుడ్ ఆఫర్స్ చాలానే వచ్చాయట

అయితే అఖిల్ బాలీవుడ్ లో నటించడానికి కూడా సిద్ధమవుతున్నట్లు అప్పట్లో రూమర్స్ బాగానే వచ్చాయి. నాగార్జున కూడా కొన్ని ఇంటర్వ్యూలలో అఖిల్ కు బాలీవుడ్ ఆఫర్స్ చాలానే వచ్చాయని అన్నారు. అయితే ఇటీవల సమంత బాలీవుడ్ దర్శకుల నుంచి ఒక మంచి ఆఫర్ తీసుకువచ్చినట్లు టాక్ వస్తోంది.

సమంత సెట్ చేసిన స్టోరీ

సమంత సెట్ చేసిన స్టోరీ

ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో నటించిన సమంత ఆ వెబ్ సిరీస్ దర్శకుల వద్ద ఒక మంచి కాన్సెప్ట్ ఉన్నట్లు తెలుసుకుందట. దర్శకద్వయం రాజ్ - డీకే ఇప్పటికే బాలీవుడ్ లో మంచి క్రేజ్ అందుకుంటున్నారు. ఇక వారి వద్ద ఉన్న స్టోరీ అఖిల్ కు కరెక్ట్ గా సెట్టవుతుందని వారిని స్పెషల్ గా రిక్వెస్ట్ చేసి మరి ఒప్పించినట్లు తెలుస్తోంది. అయితే అఖిల్ కు ఇంకా కథ చెప్పలేదట. సమంత మాత్రం ఫుల్ స్క్రిప్ట్ గురించి తెలుసుకుందట.

అఖిల్ ఒప్పుకుంటాడా

అఖిల్ ఒప్పుకుంటాడా

గతంలో నాగచైతన్య వరుస డిజాస్టర్స్ తో సతమతమవుతున్న తరుణంలో కరెక్ట్ గా మజిలీ సినిమాతో సక్సెస్ వచ్చేలా చేసింది సమంత. ఇక ఇప్పుడు మరిది అఖిల్ కు కూడా అదే తరహాలో హిట్ రావాలని తెరవెనుక బాగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి అఖిల్ వదిన తెచ్చిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి. త్వరలోనే ఈ కాంబినేషన్ పై ఒక స్పెషల్ అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X