శూర్పణఖ పాత్రలో కనిపించబోతున్న సమంత?
Recommended Video

స్టార్ హీరోయిన్ సమంత... వివాహం తర్వాత ఎంచుకునే సినిమాలు, కథల విషయంలో చాలా మార్పు కనిపిస్తోంది. హీరో పక్కన పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రలు చేయడం కంటే తన పాత్రకు ఎక్కవ ఇంపార్టెన్స్ ఉంటేనే పాత్రలు చేయడానికే ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. దీంతో పాటు 'యూ టర్న్' లాంటి ప్రయోగాత్మక సినిమాలూ చేస్తున్నారు.
తాజాగా సమంత మరో ప్రయోగాత్మక సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. పౌరాణిక పాత్రలో నటించడానికి ఓకే చెప్పిందని, ఇది నెగెటివ్ పాత్ర అయినప్పటికీ పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ కావడంతో ఒప్పుకుందని తెలుస్తోంది.

శూర్పణఖ పాత్రలో సమంత?
యానిమేషన్ చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న భార్గవ్ అనే ఫిల్మ్ మేకర్ రామాయణం ఆధారంగా తెరకెక్కించే పౌరాణిక సినిమాలో సమంత శూర్పణఖ పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్.

నెగెటివ్ రోల్ సమంత ఒప్పుకోవడానికి కారణం?
ఈ సినిమా శూర్పణఖ కోణంలో సాగుతుందని తెలుస్తోంది. ఇది నెగెటివ్ పాత్ర అయినప్పటికీ పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్ కావడం, తానే కీలక పాత్రధారి కావడంతో సమంత ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారట.

గతంలో కాజల్ పేరు
గతంలో ఈ పాత్ర హీరోయిన్ కాజల్ చేయబోతోందనే వార్తలు వినిపించాయి. ఇప్పుడేమో సమంత పేరు తెరపైకి వచ్చింది. అయితే చిత్ర బృందం నుంచి అఫీషియల్ సమాచారం రావాల్సి ఉంది.

సమంత సినిమాలు
ప్రస్తుతం సమంత తమిళంలో సూపర్ డిలక్స్ అనే చిత్రంతో పాటు.... తెలుగులో నాగ చైతన్యతో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. కాగా.. ఇటీవల విడుదలైన సమంత చిత్రం యూ టర్న్ బాక్సాఫీసు వద్ద యావరేజ్‌గా ఫలితాలు సాధించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











