Samantha: సమంత తల్లి కాబోతుందా? ప్రెగ్నెన్సీ రూమర్స్‌లో నిజమెంత?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు మరోసారి సక్సెస్ ట్రాక్‌లో దూసుకెళ్తోంది. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మా ఇంటి బంగారం' పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించగా సమంత హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఈవెంట్ లో సమంత లుక్ చర్చనీయంగా మారింది. అసలేం జరిగిందంటే?

మా ఇంటి బంగారం ఈవెంట్స్, ఇంటర్వ్యూలు, ఇతర సెలబ్రేషన్స్‌లో సంప్రదాయ దుస్తువులు, చీరలలో కనిపించింది. కానీ, సక్సెస్ మీట్ లో మాత్రం సమంత మెడ్రన్ డ్రెస్ లో కనిపించింది. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కొన్ని యాంగిల్స్‌లో ఆమె బేబీ బంప్‌తో కనిపించినట్లు నెటిజన్లు కామెంట్లు చేయడంతో ప్రెగ్నెన్సీ రూమర్స్ ఒక్కసారిగా ఊపందుకున్నాయి. దీంతో "సమంత తల్లి కాబోతోందా?" అనే ప్రశ్న సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది.

Samantha Pregnancy Rumours Go Viral After Maa Inti Bangaaram Success Event Appearance

నిజానికి గత కొన్ని రోజులుగా సమంత ప్రెగ్నెన్సీ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. 'మా ఇంటి బంగారం' ప్రమోషన్స్ సమయంలో కూడా ఆమె ఎక్కువగా చీరల్లోనే కనిపించడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. సాధారణంగా గ్లామరస్, ట్రెండీ ఫ్యాషన్‌కు ప్రాధాన్యత ఇచ్చే సమంత, ఈసారి మాత్రం వరుసగా సంప్రదాయ దుస్తుల్లోనే కనిపించడంతో అభిమానుల్లో అనేక సందేహాలు మొదలయ్యాయి. కొందరు నెటిజన్లు "బేబీ బంప్‌ను దాచేందుకే చీరలు ధరిస్తోందా?" అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

సమంత వ్యక్తిగత జీవితాన్ని చూస్తే.. నాగ చైతన్యతో విడాకుల అనంతరం ఆమె జీవితంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత దర్శకుడు, నిర్మాత రాజ్ నిడిమోరుతో పరిచయం, ప్రేమలో పడటం, గతేడాది వీరిద్దరూ డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్‌లో అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె, ఇప్పుడు 'మా ఇంటి బంగారం'తో గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చింది.

ఇక సినిమా విషయానికి వస్తే, 'మా ఇంటి బంగారం' విడుదలైన తొలి రోజు నుంచే మంచి స్పందన అందుకుంటోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యువత కూడా సినిమాను ఆదరిస్తున్నారు. సమంత నటనకు ప్రశంసలు దక్కుతుండగా, బాక్సాఫీస్ వద్ద కూడా సినిమా మంచి వసూళ్లు రాబడుతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా తొలిరోజు రూ. 13.15 కోట్లు వసూలు చేసిందని మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ సక్సెస్‌తో సమంత అభిమానులు ఆనందంలో ఉండగానే, ఇప్పుడు ప్రెగ్నెన్సీ వార్తలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వార్తలపై సమంత టీమ్ నుంచి కానీ, ఆమె వ్యక్తిగత వర్గాల నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫోటోలు, వీడియోల ఆధారంగానే ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. అందువల్ల ఇప్పటివరకు ప్రెగ్నెన్సీ వార్తలను ధృవీకరించే అధికారిక సమాచారం లేదు. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇవన్నీ సోషల్ మీడియాలో జరుగుతున్న ఊహాగానాలుగానే పరిగణించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X