Samantha Wedding: రెండో పెళ్లికి సమంత ముహుర్తం... రాజ్ నిడిమోరు మాజీ భార్య సోషల్ మీడియా పోస్ట్

Samantha Wedding: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన ఫ్యాషన్‌తోనూ అందరినీ ఆకట్టుకుంటుంటుంది. సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు నిరంతరం టచ్‌లో ఉంటోంది. అయితే.. గత కొన్ని నెలలుగా సమంత సినిమాలతో కంటే తన వ్యక్తిగత కారణాలతోనే ఎక్కువ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా రెండోసారి పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏం జరిగింది?

హీరోయిన్ సమంత గత కొంతకాలంగా బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru) తో సన్నిహితంగా ఉంటున్నారనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. అయితే.. ఈ వార్తలపై ఈ జంట ఎప్పుడూ కూడా స్పందించలేదు. కానీ,తాజాగా సమంత రెండోసారి పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. తన బాయ్ ఫ్రెండ్, డైరెక్టర్ రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకోబోతున్నారనీ ప్రచారం.

Samantha-Raj Nidimoru Marriage Rumours Viral Social Media Buzz After Ex-Wife s Cryptic Post

అంతేకాకుండా.. సమంత, రాజ్ నిడిమోరుల వివాహం కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్ లో జరగబోతుందన్న కథనాలు ట్రెండ్ అవుతున్నాయి. ఈ వార్తలపై అధికారికంగా సమంత గానీ, రాజ్ గానీ ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూర్చడానికి కారణం.. డైరెక్టర్ రాజ్ మాజీ భార్య శ్యామలి చేసిన పోస్ట్. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే శ్యామలి, తాజాగా "బరితెగించిన వ్యక్తులు అలాంటి పనులే చేస్తారు" అంటూ పోస్టు చేసింది. దీంతో సమంత పెళ్లి అనే వార్త సోషల్ మీడియాలో చర్చకు కారణమైంది.

అయితే.. ఆమె ప్రత్యేకంగా ఎవరిని సూచించకపోయినా, సమంత-రాజ్ వివాహ వార్తల హడావిడిలో ఈ పోస్ట్ రావడం వల్ల అంతా అదే విషయానికి కనెక్ట్ చేస్తోంది. చాలా మంది యూజర్లు "ఇది సమంత, రాజ్‌పై అసహనమేనా?, నిజంగా వారు పెళ్లి చేసుకోబోతున్నారా? అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు " తన బాధను ప్రకటించే భావోద్వేగ పోస్ట్ మాత్రమే" అంటున్నారు.

సమంత జీవితంలో ఈషా యోగా సెంటర్‌కు ఉన్న అనుబంధం తెలిసిందే. సద్గురు జగ్గీ వాసుదేవ్ నిర్వహించే కార్యక్రమాల్లో ఆమె తరచూ పాల్గొంటుంది. కష్ట సమయంలో, ఆరోగ్య సమస్యల సమయంలో ఆమె ఆధ్యాత్మికంగా అక్కడే సేదతీరింది. ఈ కారణంగా "సమంత రెండో పెళ్లిని సద్గురు ఆశీర్వాదంతో ఈశా ఫౌండేషన్‌లో జరపబోతుంది" అన్న ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది.

సమంత - రాజ్ నిడిమోరు రిలేషన్ రూమర్స్ ఎలా మొదలయ్యాయి?
గత కొన్ని నెలలుగా సమంత, బాలీవుడ్ డెరెక్టర్ రాజ్ నిడిమోరు మధ్య డేటింగ్ జరుగుతోందనే కథనాలు వినిపిస్తున్నాయి. తాజాగా సమంత తన సోషల్ మీడియాలో రాజ్‌తో ఉన్న ఫోటోలు షేర్ చేయడంతో ఈ జంటపై ఊహాగానాలు మరింత పెరిగాయి. సినీ వర్గాల్లో కూడా వీరిద్దరూ చెన్నై, హైదరాబాద్, ముంబైలో తరచూ కలిసి కనిపించారనే సమాచారం జరుగుతోంది. దీంతో ఇలాంటి పుకార్లు పుట్టుకవస్తునే ఉంటాయి. కాబట్టి ఆమె ఈ విషయాన్ని ఖండించేదాకా... లేదా స్వయంగా బయటపెడేదాకా, ఇలాంటి వార్తలు మరికొన్నిసోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం ఖాయం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X