»   » రాజమౌళి చిత్రంలో సమంత.. షాక్ ఎన్టీఆర్‌కా? రాంచరణ్‌కా?

రాజమౌళి చిత్రంలో సమంత.. షాక్ ఎన్టీఆర్‌కా? రాంచరణ్‌కా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

అక్కినేని వారసుడు నాగచైతన్యతో వివాహం తర్వాత సమంత సినిమాల జోరుపెంచింది. తమిళంలో ఓ రెండు చిత్రాలు, కన్నడ చిత్రం యూటర్న్ రీమేక్‌లో సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించే మల్టీస్టారర్ చిత్రంలో కూడా సమంత నటిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రాంచరణ్ కలిసి నటిస్తున్నారు. ఇంకా పేరు పెట్టిన ఈ చిత్రంలో ఓ హీరోయిన్ పాత్రకు సమంతను ఎంపిక చేసినట్టు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.

అప్పడు ప్రభాస్,రానా ...ఇప్పడు చరణ్, ఎన్టీఆర్
తొలుత బాలీవుడ్ హీరోయిన్

తొలుత బాలీవుడ్ హీరోయిన్

బాలీవుడ్ హీరోయిన్‌ను ‌తొలుత ఈ చిత్రంలో నటింపజేయాలని రాజమౌళి అనుకొన్నారట. కానీ ఈ సినిమాలోని కథానాయిక పాత్రకు సమంత అయితే బాగుంటుందనే అభిప్రాయాల మేరకు తన నిర్ణయాన్ని మార్చుకొన్నారట.

సమంతతో చర్చలు

సమంతతో చర్చలు

ప్రస్తుతం సమంత ఎంపిక విషయం చర్చల దశలోనే ఉన్నట్టు తెలుస్తున్నది. త్వరలోనే సమంత పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

ఎస్ఎస్ రాజమౌళితో ఈగలో

ఎస్ఎస్ రాజమౌళితో ఈగలో

దర్శకుడు రాజమౌళి చిత్రంలో సమంత నటించడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఈగ చిత్రంలో నటించన సమంత విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకొన్నారు. ఆ చిత్రం కలెక్షన్లపరంగా భారీ విజయాన్ని సాధించింది.

రాంచరణ్‌కు జోడిగా

రాంచరణ్‌కు జోడిగా

తాజా సమాచారం ప్రకారం రాంచరణ్‌కు జోడిగా సమంత నటించనున్నారట. ప్రస్తుతం రంగస్థలం చిత్రంలో చెర్రి, సమంత కలిసి నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానున్నది.

రాశీ, రకుల్ ప్రీత్ పేర్లు

రాశీ, రకుల్ ప్రీత్ పేర్లు

ప్రముఖ నిర్మాత దానయ్య రూపొందించే ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్రలకు రాశీఖన్నా, రకుల్ ప్రీత్ సింగ్‌ను కూడా పరిగణనలోకి తీసుకొన్నట్టు తెలుస్తున్నది.

ఆగస్టులో సెట్స్‌పైకి

ఆగస్టులో సెట్స్‌పైకి

బాహుబలి తర్వాత ప్రతిష్టాత్మకంగా రూపొందే చిత్రం ఆగస్టు నెలలో సెట్స్‌పైకి వెళ్లనున్నది. రాంచరణ్, ఎన్టీఆర్ కలయికలో వస్తున్న మొదటి చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

English summary
SS Rajamouli's upcoming film with Ram Charan and Jr NTR. latest buzz from Tinsel Town suggests that Samantha Akkineni is being considered for one of the female leads. The talks with Samantha is currently underway, according to reports.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu