»   » హాట్ టాపిక్ : రామ్ చరణ్ ని మళ్లీ రిజెక్ట్ చేసింది

హాట్ టాపిక్ : రామ్ చరణ్ ని మళ్లీ రిజెక్ట్ చేసింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ తో చేయటానికి సమంత మరోసారి రిజెక్ట్ చేసిందనే వార్త అంతటా వినిపిస్తోంది. కృష్ణ వంశీ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందనున్న చిత్రానికి గానూ ఆమెను హీరోయిన్ గా అడిగితే డేట్స్ ఖాళీగా లేవని రిజెక్టు చేసిందని తెలుస్తోంది. గతంలోనూ ఎవడు చిత్రం కోసం రామ్ చరణ్ సరసన ఆమెను అడిగారు...అయితే అప్పుడూ కాదంది...శృతిహాసన్ సీన్ లోకి వచ్చింది. మరి ఇప్పుడు ఎవరు ఈ సినిమాలోకి వస్తారో చూడాలి. రామ్ చరణ్ ఏం స్పందిస్తాడో అని ఆసక్తిగా చూస్తున్నారు.

రామ్ చరణ్ త్వరలో కృష్ణ వంశీ దర్శకత్వంలో మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నరంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలు నిజమేనని, వెంకటేష్ గారితో కలిసి పని చేయబోతున్నట్లు రామ్ చరణ్ సైతం మీడియాకు స్వయంగా వెల్లడిచారు. ఈ చిత్రం వెంటనే ప్రారంభించాలని రామ్ చరణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. బండ్ల గణేష్ నిర్మించనున్న ఈ చిత్రం అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభం కానుందని సమాచారం. ఈ మేరకు టీమ్...రామ్ చరణ్ సరసన చేసే హీరోయిన్ కోసం వెతుకుతున్నారు.

రామ్ చరణ్ మాట్లాడుతూ... తెలుగులో కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాను. ప్రస్తుతం ఆ కథమీదే కూర్చున్నాం. కృష్ణవంశీ ఒక మంచి కుటుంబ కథని తయారు చేస్తున్నారు. ఇప్పుడు ప్రేక్షకులు కుటుంబకథా చిత్రాల్ని చూడటానికి ఇష్టపడుతున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాం. అలాగే వెంకటేష్‌గారితో కలిసి నటించాలని ఎప్పట్నుంచో అనుకొం టున్నా. అది త్వరలోనే నెరవేరుతుంది. ఇది మల్టీస్టారర్‌ చిత్రమే. పూర్తి వివరాలు మాత్రం నెల తర్వాత తెలుస్తాయి అన్నారు.

ఏ మాయ చేసావె చిత్రంతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిన సమంత తాజాగా రామ్ చరణ్ తేజ చిత్రంలో ఆఫర్ రిజిక్ట్ చేసినట్లు సమాచారం. గతంలోనూ ధరణి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ నిర్మించనున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా ఆమెను అడిగారు. అయితే అప్పటికే మహేష్ బాబు, ఎన్టీఆర్, రవితేజ సరసన చేయటానికి బుక్ అయ్యానని, డేట్స్ లేవని చెప్పారు.

ఇక ఎన్టీఆర్, సమంత జంటగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ బాబు నిర్మిస్తున్న చిత్రానికి 'రభస' అనే టైటిల్ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'రభస' టైటిల్ ఫైనల్ కాదని....త్వరలోనే అసలు టైటిల్ ప్రకటిస్తారని సమంత తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సినిమా షూటింగ్ ఈ రోజే మొదలైన విషయం కూడా సమంత వెల్లడించారు.

English summary
Samantha says no to Ram Charan again. This is not the first time that she rejected to act opposite Ram Charan. Previously when she was contacted to act with Charan for ‘Evadu’ movie she denied the offer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu