Samantha: సమంత రెమ్యునరేషన్‌ పెంచేసిందా? మా ఇంటి బంగారం కోసం ఎన్ని కోట్లంటే..!

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు చాలా కాలం తర్వాత పూర్తి స్థాయి కమర్షియల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 'మా ఇంటి బంగారం' సినిమాతో మరోసారి తన మార్కెట్ పవర్ ఏంటో నిరూపిస్తున్నారు. ఇప్పుడు బాక్సాఫీస్ కలెక్షన్లతో పాటు తన రెమ్యునరేషన్ కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తున్న తరుణంలో, ఈ సినిమా కోసం సమంత ఎంత పారితోషికం తీసుకుందనే అంశం సోషల్ మీడియాలో చర్చనీయంగా మారింది. ఇంతకీ మా ఇంటి బంగారం కోసం సమంత ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారంటే?

Also Read
Top 10 Heroines: సమంత దూకుడు.. శ్రీలీలకు భారీ షాక్.. త్రిష సర్‌ప్రైజ్!
Top 10 Heroines: సమంత దూకుడు.. శ్రీలీలకు భారీ షాక్.. త్రిష సర్‌ప్రైజ్!

సౌత్ ఇండస్ట్రీలో సాధారణంగా స్టార్ హీరోయిన్లు ఒక్కో సినిమాకు రూ.2 నుంచి రూ.5 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటారు. లేడీ సూపర్ స్టార్ నయనతార, త్రిష వంటి హీరోయిన్లు భారీ ప్రాజెక్టులకు రూ.5 కోట్ల వరకు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు సమంత అంతకు మించి తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సినీ వర్గాల్లో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. 'మా ఇంటి బంగారం' కోసం సమంత రూ.7 కోట్ల ఫిక్స్‌డ్ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Recommended For You
'నరకం అనుభవించా.. ఇక పైకి వెళ్లే సమయం వచ్చిందనుకున్నా'
'నరకం అనుభవించా.. ఇక పైకి వెళ్లే సమయం వచ్చిందనుకున్నా'
Samantha Remuneration for Maa Inti Bangaaram

అంతేకాదు, సినిమా లాభాల్లో (Profit Share) కూడా వాటా తీసుకునేలా ఒప్పందం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సమాచారం అధికారికంగా ధృవీకరించబడకపోయినా, టాలీవుడ్‌లో మాత్రం ఇదే ప్రధాన చర్చగా మారింది. ఈ ప్రచారం నిజమైతే, ఇది ఆమె కెరీర్‌లో అత్యధిక రెమ్యునరేషన్‌లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.

You May Also Like
Peddi OTT Release: పెద్ది ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే? రాంచరణ్ మూవీని ఎక్కడ చూడొచ్చంటే?
Peddi OTT Release: పెద్ది ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే? రాంచరణ్ మూవీని ఎక్కడ చూడొచ్చంటే?

మయోసైటిస్ కారణంగా కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చిన సమంత, మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్నారు. ఆరోగ్య సమస్యల కారణంగా కొంత గ్యాప్ వచ్చినా ఆమె స్టార్‌డమ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ పాన్ ఇండియా స్థాయిలో ఆమెకు ఉన్న మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు భారీ పారితోషికాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.

MIB Day 7 Collections: బాక్సాఫీస్‌పై సమంత వసూళ్ల ఎటాక్.. మా ఇంటి బంగారంకు ఎన్ని కోట్లంటే?
MIB Day 7 Collections: బాక్సాఫీస్‌పై సమంత వసూళ్ల ఎటాక్.. మా ఇంటి బంగారంకు ఎన్ని కోట్లంటే?

ఇతర నటీనటుల పారితోషికాలు
సమంత తర్వాత మా ఇంటి బంగారం'సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడు గుల్షన్ దేవయ్య. ఆయనకు సుమారు రూ. 1.5 కోట్లు చెల్లించినట్లు సమాచారం. హీరో దిగంత్ మంచాలే కు రూ. 50 లక్షలు, యాంకర్, నటి శ్రీముఖికి రూ.35 లక్షలు, సీనియర్ నటి గౌతమికి రూ.30 లక్షలు, నటి మంజూష ముక్కావిల్లికి రూ.10 లక్షలు ఇచ్చినట్లు సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

సుధీర్‌తో రష్మీ గౌతమ్ బ్రేకప్? పేరు పలకడానికి ఇష్టపడని జబర్దస్త్ యాంకర్
సుధీర్‌తో రష్మీ గౌతమ్ బ్రేకప్? పేరు పలకడానికి ఇష్టపడని జబర్దస్త్ యాంకర్

ఆరు రోజుల్లోనే రూ.55 కోట్లకు పైగా గ్రాస్
రెమ్యునరేషన్ వార్తలతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా 'మా ఇంటి బంగారం' మంచి ప్రదర్శన కొనసాగిస్తోంది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. సినిమా విడుదలైన ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.55.71 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇందులో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 33.20 కోట్ల నెట్, రూ. 38.36 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, ఓవర్సీస్‌లో రూ.17.35 కోట్ల గ్రాస్ రాబట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X