పవన్ కళ్యాణ్‌తో సమంత రొమాన్స్?
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సమంత రొమాన్స్ చేయబోతోందా? వరుసగా హిట్ చిత్రాలు, పెద్ద హీరోల చిత్రాల్లో నటిస్తూ వస్తున్న సమంత మరోసారి బంపర్ చాన్స్ కొట్టేసిందా? అంటు అవుననే సమాధానం వినిపిస్తోంది ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి. పవర్ స్టార్-త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందబోయే చిత్రంలో సమంతను హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
పవన్ సరసన గతంలో జల్సా చిత్రంలో నటించిన ఇలియానాను తీసుకుందామని దర్శకుడు త్రివిక్రమ్ భావించినప్పటికీ.... చివరకు సమంతను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయమై అధికారిక సమాచారం వెలువడనుంది. ఈ చిత్రం నవంబర్ నుంచి ప్రారంభం కానుంది. ప్రొడ్యూసర్ బీవీయస్‌యన్ ప్రసాద్ రిలియన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించడానికి సిద్ధం అవుతున్నారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రానికి డబ్బింగ్ కార్యక్రమాలు ముగించుకుని యూరఫ్ హాలిడే ట్రిప్‌కు సిద్దం అవుతున్నారు. ఈలోగా దర్శకుడు త్రివిక్రమ్ ప్రీప్రొడక్షన్ పనులు పూర్తి చేసి షూటింగుకు అన్నీ సిద్ధం చేయనున్నాడు. దాదాపు 40 రోజుల పాటు పవన్ కళ్యాణ్ వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తారని తెలుస్తోంది.
ఇక కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం విషయానికొస్తే.... పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈచిత్రం అక్టోబర్ 18న గ్రాండ్ గా విడుదలవ్వబోతోంది. ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా నటిస్తున్నారు. అన్యాయాలను ఎదురించే ధైర్యంగల రిపోర్టర్‌గా పవన్ కనిపించనున్నాడు. పవన్ కళ్యాణ్ కి జంటగా హీరోయిన్ తమన్నా ఇందులో కెమెరామెన్ పాత్ర చేస్తోంది.


Click it and Unblock the Notifications











