twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరోసారి సమంత లిప్ లాక్ సీన్.. ఆ హీరోతో కలిసి మొదటిసారి అలా..

    |

    గ్లామరస్ బ్యూటీ సమంత రూత్ ప్రభు ఇటీవల కాలంలో ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ఐతే అందుకుంటున్నాయి. ముఖ్యంగా వెబ్ సిరీస్ లతో కూడా ఆమె సంచలన విజయాలను సొంతం చేసుకుంటోంది. ఇక సమంత విడాకులు అనంతరం తన కెరీర్ పై మరింత ఫోకస్ పెట్టిందనే చెప్పాలి. అంతేకాకుండా ప్రయోగాత్మకమైన పాత్రలను కూడా సెలెక్ట్ చేసుకుంటోంది. అయితే మరోసారి లిప్ లాక్ సన్నివేశంలో కూడా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వార్తలు కూడా ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. ఇంతకీ సమంత ఏ హీరో తో లిప్ లాక్ సీన్ చేయబోతోంది అనే వివరాల్లోకి వెళితే..

    సమంత స్టార్ హోదా..

    సమంత స్టార్ హోదా..

    అక్కినేని నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న అనంతరం సమంత తన కెరీర్ పై గతంలో ఎన్నడూ లేని విధంగా స్పెషల్ గా ఫోకస్ చేసింది. కేవలం లోకల్ గానే కాకుండా పాన్ ఇండియా రేంజ్లో సినిమాలు చేయడానికి సిద్ధమైంది. ఆమె నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సమంత స్టార్ హీరోలు లేకుండా కూడా భారీ విజయాలను సొంతం చేసుకుంటోంది.

    అలాంటి సన్నివేశాల్లో..

    అలాంటి సన్నివేశాల్లో..

    ఇక ప్రస్తుతం ఆమె చేతిలో చాలా మంచి సినిమాలు ఉన్నాయి. అందులో ఏ ఒక్కటి సక్సెస్ అయినా కూడా ఆమె కెరీర్ మరో రేంజ్ కి వెళుతుంది అనే చెప్పాలి. అయితే సమంత ఇదివరకే కొన్ని సినిమాల్లో లిప్ లాక్ సన్నివేశాల్లో కూడా నటించింది. ఇక ఇప్పుడు కూడా ఆమె అలాంటి సన్నివేశాల్లో నటించడానికి ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. కానీ పాత్ర డిమాండ్ చేస్తే గాని అలాంటి సన్నివేశాల్లో నటించడానికి ఆమె ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది.

     ఆ సీన్ హైలెట్

    ఆ సీన్ హైలెట్

    సమంత పెళ్లి తర్వాత కూడా నటనకు ఎంతగానో ప్రాధాన్యత ఇచ్చే లిప్ లాక్ సన్నివేశాల్లో నటించింది. రంగస్థలం సినిమా లో రామ్ చరణ్ తో ఆమె నటించిన లిప్ లాక్ సన్నివేశం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆ సీన్ చాలా ప్రత్యేకంగా నిలిచింది. అంతే కాకుండా సమంత రేంజ్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది.

     విజయ్ దేవరకొండతో..

    విజయ్ దేవరకొండతో..

    అయితే కెరీర్ లో మరొక సారి ఆమె లిప్ లాక్ సన్నివేశాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అది కూడా అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ తో నటించబోతున్నట్లు సమాచారం. ఇదివరకే రౌడీ స్టార్ అర్జున్ రెడ్డి సినిమా లో ఘాటైన ముద్దులతో ఊహించని విధంగా అందరికీ షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కూడా లిప్ లాక్ సన్నివేశాలతో హైలెట్ గా నిలిచిన విషయం తెలిసిందే.

    ఖుషి సినిమాలో..

    ఖుషి సినిమాలో..

    ప్రస్తుతం సమంత నాగచైతన్య ఖుషి అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అంతేకాకుండా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగానే రూపొందిస్తున్నారు. ఎమోషనల్ క్యూట్ లవ్ స్టోరీగా రాబోయే ఈ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు కూడా హైలెట్ గా నిలుస్తాయని అంతేకాకుండా విజయ్ దేవరకొండ సమంత లిప్ లాక్ సీన్ లో కూడా నటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది మరి ఈ టాక్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

    English summary
    Samantha ruth prabhu and vijay devarakonda lip lock scene new viral
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X