నాగచైతన్యతో లింక్ ఉన్న ప్రతిదాన్ని కట్ చేస్తున్న సమంత.. కెరీర్ కోసం మరో కొత్త వ్యక్తి?

గ్లామరస్ హీరోయిన్ సమంత విడాకులు తీసుకున్న అనంతరం సినిమా కెరీర్ పై మరింతగా ఫోకస్ చేస్తోంది. ఆమె గతంలో ఎప్పుడూ లేని విధంగా విభిన్నమైన ప్రాజెక్టులను సెలెక్ట్ చేసుకోవడమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా బిజీ గా మారేలా అవకాశాలు అందుకుంటోంది. అయితే సమంత నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత అతనితో ఉన్న ప్రతి ఈ విషయంలో ఉన్న కనెక్షన్ కట్ చేయాలని బలమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

రీసెంట్ గా ఆమె ముంబైలో ఉంటూ నాగచైతన్య తో లింక్ ఉన్న మరొక విషయం లో షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతే కాకుండా సమంత జీవితంలో మరొక కొత్త వ్యక్తి కూడా చేరినట్లు తెలుస్తోంది.. ఆ వివరాల్లోకి వెళితే..

టాప్ సెలబ్రెటీ జోడిగా..

టాప్ సెలబ్రెటీ జోడిగా..

బ్యూటిఫుల్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సమంత వచ్చిన మొదట్లోనే అగ్ర హీరోయిన్ గా మారిపోయింది. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా అవకాశాలు అందుకున్న సమంత కొన్నాళ్లు నాగచైతన్య తో డేటింగ్ చేసి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. హిందూ క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం ఎంతో ఆనందంగా పెళ్లి చేసుకున్న ఈ జంట సౌత్ ఇండియన్ టాప్ సెలబ్రిటీ జోడి లలో ఒక జంటగా క్రేజ్ అందుకున్నారు.

ఊహించని విధంగా..

ఊహించని విధంగా..

సమంత నాగచైతన్య ఎప్పుడూ కలిసే ఉండాలి అని అభిమానులు కూడా సోషల్ మీడియాలో నిత్యం కోరుకుంటూ వచ్చారు. కానీ వారిద్దరు ఊహించని విధంగా విడాకులు తీసుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇద్దరి ఇష్టపూర్వకంగానే వారి వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నట్లుగా అఫీషియల్ వివరణ ఇచ్చారు.

సమంత అలా..నాగచైతన్య ఇలా..

సమంత అలా..నాగచైతన్య ఇలా..

నాగచైతన్య సమంత ఇద్దరూ విడిపోయారు అంటే ఇప్పటికి కూడా అభిమానులు ఆ విషయం నమ్మడానికి ఇష్టపడడం లేదు. ఇక నాగచైతన్య అయితే ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా తన సినిమాలతో బిజీగా మారిపోతున్నాడు కానీ సమంత మాత్రం అప్పుడప్పుడు తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది. అంతేకాకుండా జీవితానికి సంబంధించిన ఎన్నో కొటేషన్స్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండటం విశేషం.

అక్కినేని వారికి దూరంగా..

అక్కినేని వారికి దూరంగా..

అయితే సమంత విడాకులు తీసుకున్న అనంతరం నాగ చైతన్య తో ఏ విధంగానూ ఎలాంటి విషయంలోనూ లింకు ఉండకూడదనే బలమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె సోషల్ మీడియాలో నాగచైతన్యతో ఉన్న ఫోటోలను కూడా పూర్తిగా తీసేసింది. అక్కినేని కుటుంబానికి కూడా ఆమె దూరంగానే ఉంటున్నట్లు అర్థమైంది.

అతన్ని దూరం పెట్టిన సమంత

అతన్ని దూరం పెట్టిన సమంత

సమంత నాగచైతన్య ఇద్దరు కూడా ఇంతకుముందు ఓకే మేనేజర్ తో కొనసాగుతూ వచ్చారు. వారి ప్రతి విషయాన్ని కూడా అతనే దగ్గరుండి చూసుకునేవారు. ఇక సమంత, నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత సమంత ఆ మేనేజర్ ను పూర్తి గా దూరం పెట్టినట్లు తెలుస్తోంది. ఇక రీసెంట్ గా అతనితో ఉన్న అగ్రిమెంట్ ను కూడా ఆమె క్యాన్సిల్ చేసుకున్నట్లు సమాచారం.

సమంత కెరీర్ కోసం కొత్త వ్యక్తి

సమంత కెరీర్ కోసం కొత్త వ్యక్తి

సమంత కెరీర్ కోసం మరొక కొత్త వ్యక్తిని సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.. ప్రస్తుతం ముంబైలోని కొత్త ప్రాజెక్టులను ఓకే చేసేందుకు సిద్ధమవుతున్న సమంత అక్కడ మరొక మేనేజర్ ను నియమించుకున్నట్లు సమాచారం. అతను కొంతమంది ప్రముఖ బాలీవుడ్ స్టార్స్ దగ్గర కూడా వర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక సమంత కు సంబంధించిన బాలీవుడ్ ప్లాన్ మొత్తం అతనే రెడీ చేస్తున్నట్లు సమాచారం. మరి కొత్త వ్యక్తి రాకతో సమంత న్యూ కెరీర్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X