సమంత తాజా నిర్ణయంతో ఏకీభవించని ఫ్యాన్స్.. ఆమెతో అసలొద్దంటూ విన్నపాలు

నాగచైతన్యతో విడాకుల తర్వాత ఆ బాధను మరచిపోవడానికి వరుస సినిమాలు ఒప్పుకుంటున్న సమంత మరో బాలీవుడ్ సినిమా సైన్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఆమె షారుక్ ఖాన్ అట్లీ సినిమా చేయవచ్చనే ప్రచారం జరిగింది కానీ ఆ సినిమా కంటే ముందే మరో సినిమా సైన్ చేసినట్లు ప్రచారం మొదలైంది. అయితే సమంత ఆ సినిమా ఒప్పుకోవడం విషయం మీద ఆమె అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

 తీర్థయాత్రలకు వెళ్లి

తీర్థయాత్రలకు వెళ్లి

అక్కినేని నాగచైతన్య- సమంత విడాకులు ప్రకటన తర్వాత సమంత ఇప్పుడు బాధను మర్చిపోడానికి సినిమాల మీద దృష్టి పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే సమంత రెండు సినిమాలు సైన్ చేయగా ఆ రెండు సినిమాల అధికారిక ప్రకటనలు కూడా వెలువడ్డాయి. ఈ రెండు సినిమాల షూటింగ్ నవంబర్ నెలలో ప్రారంభం కానుండగా అప్పటి వరకు ఖాళీగా ఉండకుండా సమంత తన స్నేహితురాళ్లతో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళింది.

వెకేషన్ పూర్తి

వెకేషన్ పూర్తి

అక్కడ తన స్నేహితురాళ్లతో ప్రశాంతంగా వెకేషన్ పూర్తి చేసుకుని వెనక్కి తిరిగి వచ్చేసిన సమంతా ఒక బాలీవుడ్ సినిమాకి సైన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్ను బాలీవుడ్ కి వెళ్లి సెటిల్ అయి నిర్మాతగా మారి సినిమాలు కూడా నిర్మిస్తోంది. తాప్సీ పొన్ను ప్రొడక్షన్లో సమంత సినిమా చేయడం కోసం సైన్ చేసినట్లు చెబుతున్నారు. ఆ ప్రొడక్షన్ నుంచి రాబోతున్న ఒక ఫిమేల్ సెంట్రిక్ సినిమాలో సమంత అయితేనే కరెక్ట్ గా సరిపోతుందని భావించి తాప్సీ పన్ను సమంతను అప్రోచ్ కాగా కథ విన్న సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు.

 ఏమాత్రం సంతోషంగా లేరట

ఏమాత్రం సంతోషంగా లేరట

అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా కొద్ది రోజుల్లో వెలువడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు అధికారికంగా రెండు ప్రాజెక్ట్‌లు మాత్రమే ప్రకటించబడ్డాయి. మిగిలినవి అధికారిక ప్రకటనలు బయటకు వచ్చే వరకు కేవలం పుకార్లు మాత్రమే. తాప్సీ ఔట్‌సైడర్ ఫిల్మ్స్ బ్యానర్‌లో ఫీమేల్ సెంట్రిక్ సినిమాకు సమంత ఓకే చేసిందనే వార్తల్లో నిజం ఉందో లేదో తెలియనప్పటికీ అభిమానులు మాత్రం ఆమె నిర్ణయంపై అంతా సంతోషంగా లేరని అంటున్నారు.

 తాప్సీతో అసలొద్దు

తాప్సీతో అసలొద్దు

ఎందుకంటే ఆమె ఫిమేల్-సెంట్రిక్ ఫిల్మ్‌తో బాలీవుడ్‌లోకి ప్రవేశించడం తెలివైన ఆలోచన కాదు అని వారు భావిస్తున్నారని అంటున్నారు. సరైన కమర్షియల్ సినిమాతో బాలీవుడ్ లో కూడా ముందు సమంత తనని తాను నిరూపించుకోవాలని, ఆ తర్వాత ఫిమేల్ సెంట్రిక్ సినిమాల ద్వారా నటిగా స్థిరపడాలని వారు అభిప్రాయపడుతున్నారు. అదే కాక ఆమె తాప్సీ బ్యానర్‌లో లాంచ్ కావడం కూడా వారికి ఇష్టం లేదట. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక తాప్సీ ఎక్కువగా ఫెమినిజం గురించి మాట్లాడుతూ హీరోల మీద కామెంట్స్ చేస్తూ ఉండడంతో స్టార్స్ ఎవరూ ఆమెతో పని చేయడం లేదు. సామ్ విషయంలో కూడా వాళ్ళు అలాగే బిహేవ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

Recommended Video

Pushpa The Rise US Premieres Plans | Allu Arjun కెరీర్ లో ఫస్ట్ టైమ్..!! || Filmibeat Telugu
రెండు సినిమాలు లైన్ లో

రెండు సినిమాలు లైన్ లో

ఆ సంగతి అలా ఉంచితే సమంత ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమా చేస్తోంది. అలాగే నయనతార బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తుండగా ఆ సినిమాలో విజయ్ సేతుపతి, నయనతార కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలు కాకుండా మరో రెండు సినిమాలను కూడా తాజాగా సమంత ప్రకటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X