Samantha Ruth Prabhu ను వెంటాడుతున్న అరుదైన వ్యాధి.. బాలీవుడ్ యంగ్ హీరో మూవీకి గుడ్‌బై
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. యశోద సినిమా ప్రమోషన్స్‌కు ముందు తాను మయోసిటీస్ అనే వ్యాధికి గురైనట్టు స్వయంగా మీడియాకు వెల్లడించడంతో సినీ వర్గాలు, ప్రేక్షకులు, అభిమానులు, సన్నిహితులు, స్నేహితులు దిగ్బ్రాంతికి గురయ్యారు.
కండరాల నొప్పితో బాధపడుతూ కూడా యశోద సినిమాకు డబ్బింగ్ చెప్పడం జరిగింది. అయితే తాను ప్రమోషన్స్ చేయలేనని చెప్పడం జరిగింది. అయితే ఇంకా మయోసిటిస్ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో బాలీవుడ్, ఇతర ప్రాజెక్టులకు దూరమవుతున్నట్టు సమాచారం. సమంత బాలీవుడ్ సినిమా నుంచి తప్పుకొన్నారనే వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ది ఫ్యామిలీ మ్యాన్ తర్వాత
కరోనావైరస్ సమయంలో ది ఫ్యామిలీ మ్యాన్ మూవీతో సమంత రుత్ ప్రభు దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకొన్నది. ది ఫ్యామిలీ మ్యాన్ చిత్రంలోని పాత్రతో బాలీవుడ్ నిర్మాత, దర్శకుల దృష్టిని తనపైకి మరల్చుకొన్నది. ది ఫ్యామిలీ మ్యాన్ తర్వాత పలు బాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు రెడీ అయింది. అయితే కొన్ని చిత్రాలను మాత్రమే కన్ఫర్మ్ చేసింది.

మయోసిటిస్ కారణంగా సినిమాలకు దూరంగా
యశోద సినిమా తర్వాత బాలీవుడ్ సినిమాల షూటింగుకు హాజరుకావాల్సి ఉంది. అయితే ఆరోగ్య కారణాల రీత్యా బాలీవుడ్ సినిమాల షూటింగులకు దూరంగా ఉంటూ వచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల షూటింగులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రారంభం కావాల్సి రావడం, నిర్మాతలు ఇంకా వెయిట్ చేయడం కుదరని పరిస్థితుల్లో సమంత ఆ ప్రాజెక్టుల నుంచి తప్పుకొన్నట్టు సమాచారం.

వరుణ్ ధావన్‌తో సిటాడెల్ మూవీలో
అయితే తాజా బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం.. సిటాడెల్ అనే చిత్రంలో వరుణ్ ధావన్‌తో కలిసి నటించేందుకు సమంత సిద్దమైంది. ఈ చిత్రాన్ని ఒరిజినల్ ఇంగ్లీష్ వెర్షన్‌లో ప్రియాంక చోప్రా నటిస్తున్నది. ఈ సినిమాలో రిచర్డ్ మ్యాడెన్, స్టాన్లీ టుక్కీ నటిస్తున్నారు. ఈ సినిమాకు రుసో బ్రదర్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఆరోగ్య కారణాల రీత్యా సమంత తప్పుకొన్నట్టు తెలిసింది.

విజయ్ దేవరకొండతో ఖుషీ మూవీలో
సమంత తన ఆరోగ్య పరిస్థితుల కారణంగా పలు బాలీవుడ్ సినిమాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకొన్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతం షూటింగు దశలో ఉన్న విజయ్ దేవరకొండ నటిస్తున్న ఖుషీ సినిమాలో ఇంకా కొన్ని రోజులు నటించాల్సి ఉంది. అయితే జనవరిలో ప్రారంభమయ్యే షూటింగులో విజయ్ దేవరకొండతో కలిసి సమంత పాల్గొనే అవకాశం ఉందని తెలిసింది.

యశోదతో బ్లాక్‌బస్టర్ హిట్
ఇదిలా ఉండగా, సమంత నటించిన యశోద చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. సుమారు 50 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత ఓటీటీలో రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రానికి మంచి రెస్సాన్స్ లభిస్తున్నది.


Click it and Unblock the Notifications











