విజయ్ దేవరకొండతో సమంత రొమాంటిక్ మూవీ..ఆ సెంటిమెంట్ తో గ్రీన్ సిగ్నల్?
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం బెస్ట్ కాంబినేషన్ లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు హీరో హీరోయిన్ అంటేనే ప్రేక్షకుల్లో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయేవి. కానీ ఇప్పుడు మాత్రం దర్శకుడు హీరో కలయికకి మార్కెట్లో డిమాండ్ గట్టిగానే పెరుగుతోంది. ఇక కేవలం కొంతమంది హీరో హీరోయిన్స్ కలయిక కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే సమంత విజయ్ దేవరకొండ మరొక సినిమా కోసం కలిసి నటించబోతున్నారనీ వార్తలు వస్తున్నాయి. దీంతో వారి పేర్లు సోషల్ మీడియాలో నిమిషాల్లోనే ట్రెండింగ్ లిస్టులో చేరిపోయాయి. ఇక ఆ సినిమా దర్శకుడు ఎవరు ఇలాంటి సెంటిమెంట్ తో సినిమా గ్రీన్ సిగ్నల్ లభించింది అనే వివరాల్లోకి వెళితే..

పూరితో విజయ్ దేవరకొండ..
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరిజగన్నాథ్ జనగణమన అనే సినిమా మొదలు పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. వీరి కలయికలో ఇదివరకే ఓ సినిమా పూర్తయింది పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా తెరకెక్కుతున్న లైగర్ సినిమా పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ సినిమా పూర్తయిన వెంటనే ఇద్దరూ మరొక ప్రాజెక్టును వెంటనే పట్టాలు ఎక్కించడం విశేషం.

విజయ్, సమంత.. లవ్ స్టొరీ..
ఇక త్వరలోనే విజయ్ దేవరకొండ మరొక సినిమాను కూడా మొదలు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ సినిమాలో విజయ్ దేవరకొండ తో సమంత నటించబోతున్నట్లు సమాచారం. క్యూట్ లవ్ స్టోరీగా తెరపైకి రాబోయే ఆ సినిమాలో ఇద్దరు లవ్ బర్డ్స్ గా కనిపించబోతున్నారని సమాచారం. సమంత లవ్ స్టోరీ సినిమాలు చేసి కూడా చాలా కాలం అయింది. ఇక విజయ్ దేవరకొండ తో అలాంటి అవకాశం రాగానే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇదివరకే ఆ సినిమాలో..
విజయ్ దేవరకొండ సమంత ఇద్దరూ కూడా మహానటి సినిమాలో కలిసి నటించారు. సావిత్రి జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ కీర్తి సురేష్ అయినప్పటికీ ఆ సినిమా కథను ముందుకు నడిపే క్రమంలో సమంత విజయ్ దేవరకొండ పాత్రలు ఎంతగానో హెల్ప్ అయ్యాయి. ఒక విధంగా ఆ సినిమా సక్సెస్ లో వారు కూడా భాగం పంచుకున్నారు. ఆ సెంటిమెంట్ తోనే మరో సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్లు టాక్.

దర్శకుడు ఎవరంటే..
అయితే మళ్లీ చాలా కాలం తర్వాత సమంత విజయ్ దేవరకొండ పూర్తిస్థాయిలో ఒక పర్ఫెక్ట్ లవ్ స్టోరీ లో నటించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. ఇక సినిమాలో డైరెక్ట్ చేయబోయేది మరెవరో కాదు. శివ నిర్వాణ అని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ తో శివ నిర్వాణ సినిమా చేయడానికి గత ఏడాదిలోనే ఒక కమిట్మెంట్ తీసుకున్నాడు.
Recommended Video

ఇద్దరితో హిట్ సినిమాలు..
ముందుగానే విజయ్ దేవరకొండకు శివ నిర్వాణ కథను కూడా వివరించగా రౌడీ స్టార్ సినిమా చేయడానికి సింగిల్ సిట్టింగ్ లోనే ఒప్పుకున్నాడు. ఇక హీరోయిన్ గా సమంతను ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదివరకే సమంత శివ నిర్వణ దర్శకత్వంలో మజిలీ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. నాగచైతన్యతో చివరగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక విజయ్ దేవరకొండ తో అలాగే శివ నిర్వాణ ఇదివరకే మంచి సక్సెస్ లు అందుకున్న సమంత మరోసారి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











