పుష్ప 2లో సమంత సర్‌ప్రైజ్: అల్లు అర్జున్ మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ లీక్

గతంలో కంటే ఇప్పుడు టాలీవుడ్‌లో సూపర్ హిట్ మూవీలకు సీక్వెల్స్ ఎక్కువగా రూపొందుతోన్నాయి. అలాంటి వాటిలో కొన్నేళ్ల క్రితం వచ్చి పాన్ ఇండియా రేంజ్‌లో సూపర్ డూపర్ హిట్ అయిన 'పుష్ప ది రూల్' మూవీకి కొనసాగింపుగా తెరకెక్కుతోన్న 'పుష్ప ది రైజ్' ఒకటి. దీంతో ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉండగా.. అందుకు తగ్గట్లుగానే దీన్ని తీస్తున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'పుష్ప ది రైజ్' మూవీ బాక్సాఫీస్‌పై ఎంతటి ప్రభావాన్ని చూపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనికితోడు బన్నీకి నేషనల్ అవార్డును కూడా తెచ్చిపెట్టింది. అందుకే 'పుష్ప ది రూల్' మూవీ కోసం అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఇందులో పుష్ప రాజ్ సిండికేట్‌ బిజినెస్‌ను ఎలా రూల్ చేశాడన్నది చూపించనున్నారు.

Samantha Ruth Prabhu Guest Role in Pushpa The Rule Movie

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'పుష్ప ది రూల్'కు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను చిత్ర యూనిట్ ఎప్పుడో ప్రారంభించింది. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకూ టాకీ పార్టును కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి.. ఎలాగైనా ఈ చిత్రాన్ని ఆగస్టు 15వ తేదీన విడుదల చేయాలని చూస్తున్నారు.

పాన్ ఇండియా మొత్తం ప్రభావాన్ని చూపిస్తోన్న 'పుష్ప ది రూల్' మూవీలో ఎంతో మంది స్టార్లు భాగం అవుతున్నారు. ముఖ్యంగా చాలా మంది నేషనల్ క్రేజ్ ఉన్న ప్రముఖులను ఈ సినిమా కోసం తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా 'పుష్ప 2' కోసం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు‌ను ఓ ముఖ్యమైన పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారని తెలిసింది.

Samantha Ruth Prabhu Guest Role in Pushpa The Rule Movie

'పుష్ప ది రైజ్' మూవీలో సమంత స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆమె వెనుక ఓ కథ ఉంటుందట. దాన్ని 'పుష్ప ది రూల్'లో చూపించబోతున్నారని, ఆ ట్విస్ట్ వచ్చినప్పుడు సినిమాలో అల్లు అర్జున్‌తో పాటు ఆడియెన్స్‌కు కూడా మైండ్ బ్లాక్ అయిపోతుందని సమాచారం. దీంతో సమంత రోల్‌పై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోతోన్నాయి.

ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్ - సుకుమార్ కలిసి చేస్తున్న 'పుష్ప ద రూల్' సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా చేస్తోండగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నాడు. సునీల్, అనసూయ కీలక పాత్రలు చేయనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ దీనికి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X