పెళ్ళైన డైరెక్టర్ తో సమంత డేటింగ్? ఆ షూటింగ్ లో పీకల్లోతు ప్రేమలో.!
కొద్దినెలలుగా జరుగుతున్న ప్రచారానికి తెరదించుతూ అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల సైలెంట్‌గా నిశ్చితార్ధం చేసుకుని ఇండస్ట్రీకి, అభిమానులకు షాకిచ్చారు. ఎప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందని మీడియా కోడై కూసింది. చైతూ ఏంటీ శోభితతో ప్రేమలో పడటమేంటని చాలా మంది కనుబొమ్మలు చిట్లించారు. కానీ కట్ చేస్తే మీడియా చెప్పిందే నిజమైంది. వీరిద్దరి ఎంగేజ్‌మెంట్‌ను నాగార్జున అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేశారు. సినీ ప్రముఖులు, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతూ ఆశీర్వదిస్తున్నారు.
విడాకుల తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న నాగచైతన్య .. ఒంటరిగా జీవితాన్ని లీడ్ చేయలేమని తొందరగానే గ్రహించి మరో తోడును వెతుక్కున్నారు. మరి సమంత పరిస్ధితేంటీ అంటూ మీడియాలో, సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది. నాగచైతన్యతో విడాకులయ్యాక సమంత చాలా స్ట్రగులైంది. పర్సనల్ లైఫ్‌లో వచ్చిన ఇబ్బందులను అధిగమించడానికి మిత్రులతో కలిసి విహారయాత్రలకు , ఫారిన్ టూర్లకు వెళ్లింది. పనిచేస్తూ బాధను మరిచిపోవాలనే ఉద్దేశంతో సినిమాలు, వెబ్‌సిరీస్‌లకు వరుసపెట్టి సంతకం చేసింది.

ఇంతలోనే మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారినపడ్డారు సమంత. దీనికి ట్రీట్‌మెంట్ తీసుకుంటూనే , సినిమాలు కంప్లీట్ చేశారు. ఆమె ఆరోగ్యంపై రకరకాల కథనాలు రావడంతో అభిమానులు కంగారు పడ్డారు. భగవంతుడి దయ వల్ల సామ్ తొందరగానే రికవరీ అయ్యారు. హెల్త్‌ను కాపాడుకుంటూనే, ఆధ్యాత్మిక సేవలో సేదతీరారు సమంత. తీరిక వేళల్లో కోయంబత్తూరులోని సద్గురు జగ్గీవాసుదేవ్ ఆశ్రమంలో గడుపుతూ రీఛార్జ్ అవుతున్నారు. తన ఇమేజ్, వయసుకు తగ్గపాత్రలు వస్తే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తున్నారు సమంత.
నాగచైతన్య- శోభిత ఎంగేజ్‌మెంట్ నేపథ్యంలో సమంతకు సంబంధించి ఓ హాట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ పెళ్లయిన డైరెక్టర్‌తో ఆమె చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని.. త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారన్నది ఆ వార్త సారాంశం. ఫ్యామిలీ మెన్ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించిన రాజ్ నిడుమోర్‌తో సామ్ డేటింగ్‌లో ఉన్నట్లుగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. వీరిద్దరి మధ్య చాలా ఏళ్లుగా ప్రేమాయణం సాగుతోందని.. ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ తర్వాతే చైతూకి సమంత విడాకులు ఇచ్చారనే వార్తలు వస్తున్నాయి.
సమంతతో ప్రేమలో ఉన్నందున రాజ్ కూడా తన భార్యకు డివోర్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. ఇటీవల సమంత బర్త్ డేను ఆయన గ్రాండ్‌గా నిర్వహించారట. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే రాజ్ నిడుమోరు తెలుగువారేనట. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా ఆయన స్వస్థలమట. దీంతో సమంత మరోసారి తెలుగింటి కోడలు అవుతారని.. త్వరలోనే వీరిద్దరూ తమ బంధంపై అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ఫిలింనగర్‌లో చర్చ జరుగుతోంది. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











