సమంత - లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్.. LCUలోకి సామ్ ఎంట్రీ?
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కొన్నేళ్ల పాటు తెలుగు తెరపై దుమ్ములేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సౌత్, బాలీవుడ్ లో సందడి చేస్తోంది. అయితే కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తాజాగా సమంత రూత్ ప్రభు గురించి మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. తన రాబోయే చిత్రంలో సమంతతో ప్లాన్ చేస్తున్నట్టు రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
కూలి ప్రమోషన్స్ జోరుగా..
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ కూలి. ఈ గ్యాంగ్ స్టర్ చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేయడం విశేషం. 16 రోజుల్లో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. దీంతో సినిమాను మేకర్స్, టీమ్ జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా లోకేష్ కనగరాజ్ బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ ను పెంచేస్తున్నారు. తన ఇంటర్వ్యూల్లో కూలి చిత్రంతో పాటు తను క్రియేట్ చేసిన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ గురించి కూడా ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తూ వస్తున్నారు. తాజాగా సమంత రూత్ ప్రభు గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసినట్టు తెలుస్తోంది.

సమంత గురించి లోకేష్ కనగరాజ్..
ప్రస్తుతం సమంత ఇండియాలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగిన సంగతి తెలిసిందే. పుష్ప చిత్రంలో స్పెషల్ సాంగ్ ఊ అంటావా మావ, ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో లోకేష్ కనగరాజ్ సమంత రూత్ ప్రభుతోనూ కలిసి పని చేయాలని భావించారంట. ముఖ్యంగా సమంత రూత్ ప్రభుతో లోకేషన్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో సెపరేట్ ఫిల్మ్ తీయాలని ప్లాన్ చేశారంట. సమంతనే లీడ్ రోల్ లో పెట్టి ఆ ప్రాజెక్ట్ ను షూట్ చేసే అవకాశం ఉందంట. అది కూడా ఖైదీ 2తోనే అనుకుంటున్నారని ప్రచారం జరిగింది. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం లేదు.
లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్..
2019లో లోకేష్ కగరాజ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ఖైదీ చిత్రం ఎంత బ్లాక్ బాస్టర్ అయ్యిందో తెలిసిందే. ఆ ప్రాజెక్ట్ తర్వాత విక్రమ్, లియో వంటి ప్రాజెక్ట్స్ ను తీసుకొచ్చారు. ఈ చిత్రంలో డ్రగ్ మాఫియా, గ్యాంగ్ స్టర్స్ కు సంబంధించిన అంశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ కథతో ఒక యూనివర్స్ ను క్రియేట్ చేశారు. ఖైదీలో డ్రగ్స్ ను పట్టుకున్న కార్తీ, విక్రమ్ లో డ్రగ్ మాఫియా కింగ్ గా రోలెక్స్ సూర్య, లియోలో విజయ్ దళపతితో ఆకట్టుకున్నారు. ఇక నెక్ట్స్ ఖైదీ2పై ఫోకస్ పెట్టారు.
కూలి భారీ బడ్జెట్..
రజనీకాంత్ కూలి చిత్రానికి భారీ బడ్జెట్ వెచ్చించారు. సన్ పిక్చర్స్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత కళానిధి మారన్ రూ.350 కోట్లతో ఈ ప్రాజెక్ట్ ను నిర్మించడం విశేషం. భారీ కాస్ట్, టాప్ టెక్నీషియన్లు పనిచేయడంతో సినిమాకు ఆ స్థాయిలో ఖర్చైందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో రజనీకాంత్, అక్కినేని నాగార్జున, ఉపేంద్ర కీలక పాత్రల్లో నటించారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. పూజా హెగ్దే స్పెషల్ సాంగ్ తో, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ అతిథి పాత్రతో అలరించబోతున్నారు. అనిరుధ్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











