సమంతకు కలిసొచ్చిన డ్రగ్స్ కేసు.. చైతూ వల్ల మిస్సయిన బంపర్ ఆఫర్ మళ్ళీ చేతికి?

అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు ప్రకటన తర్వాత ప్రతి రోజు వారికి సంబంధించి ఏదో ఒక వార్త వెలుగులోకి వస్తూనే ఉంది. తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అనే కారణంతో సమంత మూడు యూట్యూబ్ ఛానల్స్ మీద పరువు నష్టం దావా వేయగా అందులో కోర్టు సమంతకు ఊరటనిస్తూ ఆమెకు సంబంధించిన వివరాలు ఎలా పడితే అలా ప్రచురించకూడదు అంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు సమంతకు మరో బంపర్ ఆఫర్ తగ్గినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

ఊహించినట్లుగానే విడాకులు

ఊహించినట్లుగానే విడాకులు

అక్కినేని నాగచైతన్య, సమంత ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లు పెద్దఎత్తున ప్రచారం జరిగింది. చివరికి ఆ ప్రచారమే నిజమయి తాము విడాకులు తీసుకుంటున్నామని అధికారికంగా ఈ జంట ప్రకటించింది. ఇక వీరు విడాకుల తర్వాత అనేక ప్రచారాలు వీరి గురించి జరుగుతూ వచ్చాయి. సమంత కారణంగానే విడాకులు జరిగాయి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

కోర్టులో ఊరట

కోర్టులో ఊరట

సమంత కారణంగా విడాకులు జరిగాయి అంటే పర్వాలేదు కానీ ఆమెకు వేరే వాళ్ళతో ఫైర్ లు ఉన్నాయని కొంత మంది, పిల్లలు కనడం ఆమెకు ఇష్టం లేకపోవడంతో నాగచైతన్య విడాకులు ఇచ్చాడని కొంతమంది. ఇలా పిచ్చి పిచ్చి ప్రచారాలు చేస్తూ ఉండడంతో మరోసారి అలా చేయవద్దని సోషల్ మీడియా వేదికగా సమంత కోరింది. అయినా వినకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆమె కోర్టుకు వెళ్లడంతో కోర్టు కూడా ఆమెను ఇబ్బంది పెట్టవద్దు అంటూ ఆదేశాలు జారీ చేసింది.

సమంత పిల్లల కోసం?

సమంత పిల్లల కోసం?

ఈ సంగతి అలా ఉంచితే అక్కినేని నాగ చైతన్యతో ఒక కుటుంబాన్ని ప్లాన్ చేసేందుకుగాను సమంత సినిమాలకు బ్రేక్ తీసుకోబోతోంది అంటూ ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే తమిళ టాప్ డైరెక్టర్ అట్లీ, బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ ఆఫర్ రాగా దానిని తిరస్కరించింది అని ప్రచారం జరిగింది. సమంత వద్దు అనడంతో అట్లీ నయనతారను సంప్రదించారని నయనతార ఒప్పుకుందని ఆ ప్రచారం సారాంశం.

నయనతార డేట్స్ వృధా?

నయనతార డేట్స్ వృధా?

అయితే ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఇరుక్కుని జైలు శిక్ష అనుభవిస్తున్న కారణంగా షారుక్ ఖాన్ షూటింగ్ చేయడానికి ఆసక్తి చూపించడం లేదని ఈ కారణంగా నయనతార షారుఖాన్ సినిమా కోసం ఇచ్చిన డేట్స్ అన్నీ వృధా అవుతున్నాయని అంటున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ నయనతార డేట్లు సర్దుబాటు చేసే అవకాశం లేదని అంటున్నారు ఈ నేపథ్యంలోనే నయనతారతో పెద్దగా షూటింగ్ జరగలేదు కాబట్టి ఆమెను తొలగించి మళ్లీ సమంతను హీరోయిన్ గా తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

Recommended Video

Bigg Boss Telugu 5 : Siri ఫ్యూచర్ Shannu చేతిలో.. పాపం Lobo || Filmibeat Telugu
నిజం కాకపోవచ్చు?

నిజం కాకపోవచ్చు?

అయితే ఈ విషయం మీద కోలీవుడ్ వర్గాలలో మాత్రం భిన్నమైన ప్రచారం జరుగుతోంది సినిమా షూటింగ్ ఆగిపోయిన మాట వాస్తవమే అందుకోసం నయనతార డేట్లు కూడా వృథా అవుతున్న సంగతి కూడా నిజమే, కానీ నయనతార మళ్ళీ డేట్లు సర్దుబాటు చేయలేనంత బిజీ షెడ్యూల్లో అయితే లేదని ఈ ప్రచారం నిజం కాకపోవచ్చు అని అంటున్నారు. ఒకవేళ ఈ ప్రచారం గనుక నిజమైతే సమంతకు మరో బంపర్ ఆఫర్ తగిలినట్లే చెప్పవచ్చు. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X