సమంత రెండో పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. అప్పుడే రాజ్ రాజ్ నిడిమోరుతో బంధం అఫీషియల్!
అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత తన సినిమాలే జీవితంగా బతుకుతున్నారు సమంత రూత్ ప్రభు. వెబ్ సిరీస్‌లు, సినిమాలతో పాటు ఈ మధ్యే నిర్మాతగా మారి శుభం అనే సినిమాను తెరకెక్కించారు. సినిమాలు చేసినా చేయకపోయినా భారతదేశంలో సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. కెరీర్ పరంగా దూసుకెళ్తున్న సమంత.. వ్యక్తిగత జీవితంలోనూ సంతోషంగా ఉండాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.
సినిమాలకు దూరంగా
ఖుషీ, శాకుంతలం సినిమాల రిజల్ట్‌తో సినిమాలకు గ్యాప్ ఇచ్చారు సమంత. సినిమాల కంటే వెబ్ సిరీస్‌లు చేయడమే బెటరనే ఆలోచనలో సమంత ఉన్నారు. ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే మూవీతో పాటు రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్ అనే వెబ్‌సిరీస్‌లో సమంత నటిస్తున్నారు. రక్త్ బ్రహ్మాండ్ సిరీస్‌కు రాజ్ - డీకేలు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయిందంటూ కొన్నిరోజులుగా పుకార్లు చక్కర్లు కొట్టడంతో అలాంటిదేమీ లేదని షెడ్యూల్ ప్రకారమే షూటింగ్ జరుగుతుందని రాజ్- డీకే క్లారిటీ ఇచ్చారు. ఈ వెబ్ సిరీస్‌లో ఆదిత్య రాయ్ కపూర్, సమంత, వామికా గబ్బీ తదితరలు కీలకపాత్ర పోషిస్తున్నారు.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా
సినిమాలకు బ్రేక్ ఇచ్చినా సోషల్ మీడియాలో మాత్రం సమంత హల్‌చల్ చేస్తున్నారు. ఫోటోలు, రీల్స్ షేర్ చేస్తుంటారు. వర్కవుట్స్, ఫుష్ అప్స్ గురించి వీడియోలు పోస్ట్ చేస్తూ.. అవగాహన కల్పిస్తుంటారు. అలాగే హీరోయిన్ కీర్తి సురేష్‌తో దిగిన ఫోటో పంచుకున్న సమంత.. ఆమెతో ఉంటే అసలు టైమే తెలియదని పేర్కొంది. మహానటి సినిమా తర్వాతి నుంచి వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ కుదిరింది. స్వతహాగా ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తుండే సమంతను ఇటీవల కొందరు ఫోటోగ్రాఫర్లు చుట్టుముట్టడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంబైలోని బాంద్రాలో వర్కవుట్స్ పూర్తి చేసుకుని బయటికి వస్తుండటంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
రాజ్ నిడిమోరుతో సామ్ డేటింగ్
కాగా.. సిటాడెల్, ఫ్యామిలీ మెన్ సిరీస్‌లు తెరకెక్కించిన దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత కొద్దినెలలుగా క్లోజ్‌గా ఉండటంతో వీరిద్దరి బంధంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే రాజ్‌ను సమంత పెళ్లి చేసుకోబోతున్నారని, దీనికి సంబంధించిన ఏర్పాట్లు తెరవెనుక జరుగుతున్నట్లు గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలకు జంటగా వెళ్లడంతో పాటు ఇటీవల శుభం సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో సమంత పక్కనే రాజ్ ఉండటం చర్చనీయాంశమైంది.
బంధంపై మౌనం వీడతారా?
వీటిని సామ్, రాజ్‌లు పలుమార్లు ఖండించినా పుకార్లు ఆగడం లేదు. మధ్యలో రాజ్ నిడిమోరు భార్య.. నమ్మకం, ప్రేమ, రిలేషన్ అంశాలపై పోస్టులు పెడుతూ అనుమానాలను మరింత పెంచేస్తున్నారు. ఈ నేపథ్యలో రాజ్ - సమంతల గురించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇప్పటి వరకు గుట్టుగా ఉంచిన తమ బంధాన్ని వీరిద్దరూ ఈ ఏడాది అధికారికంగా ప్రకటిస్తారని గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట ఇక తమ బంధాన్ని దాచడం మంచిది కాదని ఓ అభిప్రాయానికి వచ్చేసినట్లుగా టాక్. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











